కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన ‘సికిందర్’ సినిమా అనుభవాలు ‘రభస’ కు ఈ సినిమా విడుదల కాకుండానే పాఠాలుగా మారుతున్నాయి అంటూ ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఏ ఒక్క చిన్న పొరపాటు జరగా కూడదు అన్న ఉద్దేశ్యంతో ‘రభస’ టీమ్ ఈ సినిమా ఫైనల్ సెన్సార్డ్ కాపీని చూసిన తరువాత ఈ సినిమాకు వచ్చిన 2 గంటల 30 నిముషాల సినిమా నిడివిని ఒక పది నిముషాలు తగ్గిస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నట్లు ఫిలింనగర్ లో రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం బ్రహ్మనందం కామెడీ సీన్స్ ఈ సినిమాలో మరీ ఎక్కువగా ఉండటంతో ఆ కామెడీ సీన్స్ ను కొంత వరకు తగ్గిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ‘రభస’ యూనిట్ చేస్తోందని టాక్. గత వారం విడుదలైన సూర్య ‘సికిందర్’ సినిమా మొదట్లో 2 గంటల 40 నిముషాల నిడివితో ప్రేక్షకులకు అసహనాన్ని తెప్పించి ‘సికిందర్’ కు ఫైయిల్యూర్ టాక్ వచ్చిన తరువాత దాదాపు పది నిముషాలు పైగా తగ్గించినా ప్రయోజనం లేదు కాబట్టి, ‘రభస’ సినిమా నిడివి విషయంలో అటువంటి పొరపాటు మరొకసారి జరగకుండా ‘రభస’ లో బ్రాహ్మి కామెడీ ట్రాక్ ను మరీ పెంచకుండా ముందే తగ్గించి విడుదల చేస్తే ప్రేక్షకులు అసహనానికి లోను కాకుండా ఉంటారు కదా అని ‘రభస’ యూనిట్ ఆలోచన అని అంటున్నారు. ఈ వార్తలలో ఎంత నిజమో తెలియక పోయినా ఈ వార్తలే నిజం అయితే బ్రహ్మి కామెడీ సీన్స్ కు కోత బడిన మరో భారీ సినిమాగా ‘సికిందర్’ తరువాత ‘రభస’ రికార్డు క్రియేట్ చేయబోతోంది. సినిమా విడుదల కాకుండానే సినిమా నిడివి గురించి ఆలోచిస్తున్నారు అంటే ‘రభస’ లో అంత ‘రభస’ ఉండదా అనే అనుమానం ఈ గాసిప్పులు విన్నవారికి కలుగుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: