సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కెరీర్ ని లీడ్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. అయితే కాజల్ అగర్వాల్ మాత్రమే కాకుండా, తన చెల్లి కూడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి స్టార్ డం సంపాదించుకుంది. అయితే అక్కా చెల్లల్లు కావడంతో అందరూ ఎవరో ఒకరిని మాత్రమే ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు. అక్క కాజల్ అగర్వాల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సీనియర్ కాబట్టి, ఎటువంటి మూవీలో నటించాలి? ఏ విధమైన కండిషన్స్ నుండి తప్పించుకోవాలి? వంటి విషయాలను అక్కే స్వయంగా చెల్లికి చెబుతుందట. అందుకే అక్క నటించినన్ని ఎక్కువ మూవీలలో చెల్లి నిషా అగర్వాల్ నటించలేకపోయింది. అయితే అక్క కంటే స్పీడుగా ఓ విషయంలో చెల్లి చాలా ముందు ఉంది. ఫిల్మ్ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఎటువంటి ఎఫైర్ స్టోరిని నడపని కాజల్ కంటే తన చెల్లి ఈ విషయంలో చాలా స్పీడు అని నిరూపించుకుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోతోనే నిషా అగర్వాల్ నడిపిన ప్రేమ వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. ఇదిలా ఉంటే, నిషా అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నటిం చింది. కోలీవుడ్‌లో ఇష్టం చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఈ బ్యూటీ అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందుగానే పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు దాంపత్య జీవితంలో మునిగి తేలింది. ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టి పెడుతుంది. పస్తుతం మలయాళంలో భాగ్య భాగ్య అనే చిత్రంలో, తెలుగులో డీకే బోస్ చిత్రంలోను నటిస్తోంది. అలాగే తమిళంలో మరిన్ని అవకాశాల కోసం వెతుకుతుంది. ఇదిలా ఉంటే, ‘మీ అక్క కాజల్ అగర్వాల్ మాదిరి గ్లామరస్‌గా నటిస్తారా?’’ అన్న ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ బదులిస్తూ అక్కలా నేను ఎక్స్ పోజ్ ఎక్కువుగా చేయలేను. ప్రత్యేక పాత్రలు తప్పితేనే తప్ప, మిగతా పాత్రలను నటనకి స్కోప్ ఉండే విధంగా పాత్రలని ఎంచుకుంటాను అని చెప్పుకొచ్చింది.” అయితే పెళ్ళి తరువాత నటనకి దూరంగా ఉంటానని చెప్పిన నిషా, ఇప్పుడు మళ్ళీ నటిస్తాను అని వస్తుంటే అక్క, కాజల్ అగర్వాల్ కి ఇది ఓ రకంగా షాక్ లా అనిపిస్తుందట. నిషా అగర్వాల్ పెళ్ళి తరువాత సినిమాల్లో నటించడం అనేది కాజల్ అగర్వాల్ కి ఏ మాత్రం ఇష్టం లేదంట.

మరింత సమాచారం తెలుసుకోండి: