ప్రిన్స్ మహేష్ బాబు అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో. ఇటువంటి టాప్ హీరో సరసన హీరోయిన్ ఆఫర్ వస్తే ఎవరైన ఎగిరి గంతేస్తారు. అంతే కాకుండా వారి ముందు ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ, వాటిని పక్కన పెట్టేసి మహేష్ మూవీ ప్రాజెక్ట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే ఇక్కడ ఓ హీరోయిన్ విషయంలో సీన్ అంతా చాలా రివర్స్ లో జరుగుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు ఆగడు మవీకి సంబంధించిన షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగడు మూవీలో మహేష్ బాబు సరసన నటించిన హీరోయిన్ తమన్న. తమన్న, మహేష్ బాబుతో నటించడం ఇదే మొదటి సారి. అయితే షూటింగ్ లొకేషన్ లో తమన్న ప్రవర్తన చాలా షాకింగ్ గా ఉందట. తను మొదటి సారిగా ప్రిన్స్ సరసన నటిస్తున్నాననే అనే భావన తమన్నలో ఎక్కడా తెలియడంలేదంట. అంతే కాకుండా తమన్న, ఫిల్మ్ స్క్రిప్ట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ విషయలో ప్రిన్స్ తో కలిసి మాట్లాడుకోవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలోనూ తమన్న పెద్దగా మహేష్ బాబుతో మాట్లాడటం లేదంట. ‘షాక్ ఓకె చెప్పండి నేను రెడీ’ అని తనపనేదో తను చూసుకుంటుందట. దీంతో చిత్ర యూనిట్ నుండి వస్తున్న సమాచారం ప్రకారం సెట్లో మహేష్ బాబు, తమన్న మధ్య కెమిస్ట్రి అంతగా వర్కవుట్ కావటం లేదని ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి తమన్నకి ఈ ఆఫర్ అనుకోకుంగా రావడంతో, మహేష్ బాబు వాల్యూ అంటే గుర్తించలేకపోతుంది? అని టాలీవుడ్ లో కొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: