చిరంజీవి పుట్టినరోజు గడిచిపోయి రెండురోజులు అయిపోయినా ఆ పుట్టినరోజు నాటి సంగతుల హడావిడి ఇంకా ఫిలింనగర్ ను కుదిపేస్తూనే ఉంది. ఇప్పటికే రకరకాల వార్తలతో అంచనాలతో హడావిడి చేస్తున్న చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన ఒక ఆశక్తికర వార్త ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది.  చిరంజీవి తన 150వ సినిమాకు సంబంధించిన ఆలోచనలలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లేటెస్ట్ గా వచ్చి చేరాడని మెగా కాంపౌండ్ టాక్. ఇప్పటికే వినాయక్, కృష్ణవంశీ, బోయపాటి వంటి టాప్ డైరెక్టర్స్ పేర్లమధ్య జరుగుతున్న మ్యూజికల్ చైర్స్ గేమ్ లో త్రివిక్రమ్ కూడ చేరాడు అని అంటున్నారు.  ఫిలింనగర్ లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం చిరంజీవి తాను నేపాల్ వెళ్ళే ముందు త్రివిక్రమ్ తో ఈ విషయం పై ఆలోచన చేసాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. చిరంజీవి ఆలోచనల ప్రకారం తన 150వ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఉండాలని భావిస్తున్నాడు కాబట్టి అటువంటి కధకు త్రివిక్రమ్ న్యాయం చేస్తాడని మెగాస్టార్ ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే అల్లుఅర్జున్ తో ఒక సినిమాకు రెడీ అయి ఉన్న త్రివిక్రమ్ చిరంజీవి కోరిక తీర్చగాలడా ? అన్నదే ప్రశ్న. నాగార్జున కూడ తన చిన్న కుమారుడు అఖిల్ సినిమాను త్రివిక్రమ్ తో చేయించాలని శతవిధాలుగా ప్రయత్నించినా త్రివిక్రమ్ నుంచి సరైన స్పందన రాలేదు అని అంటారు. మరి ఇదే స్పందన త్రివిక్రమ్ చిరంజీవి విషయంలోను ప్రదర్శిస్తాడా లేదంటే చిరంజీవి 150వ సినిమా రేస్ లో త్రివిక్రమ్ కూడ నిలుస్తాడా అనే విషయం కొద్ది రోజులలో తేలిపోతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: