రామ్‌చరణ్ కృష్ణవంశీల క్రేజీ మూవి ‘గోవిందుడు అందరివాడేలే’ కి మరో ఊహించని సమస్య ఎదురౌతోందని టాక్. దసరా కానుకగా అక్టోబర్ 1న విడుదల అవుతుంది అని ఇప్పటికే అనేక సార్లు ప్రకటింపబడిన ఈ సినిమాకు చివరి నిముషం కస్టాలు చుట్టుముడుతున్నాయని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఎపి హెరాల్డ్ కు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ కొంత లండన్‌లో చేయాల్సివుందట.  దీనికితోడు సాంగ్స్ షెడ్యూల్ బ్యాలెన్స్ కూడా ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సినిమా యూనిట్ వర్గాలు అంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు దర్శకుడు కృష్ణవంశీ ఎడిటింగ్ రూమ్ లో ప్రతి సీన్ ను ఒకటికి రెండు సార్లు చూసి ఓకే చేయడంతో ఎడిటింగ్ కూడ ఆలస్యం అవుతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.   ఇప్పటికే ప్రకాష్ రాజ్ జయసుధల మధ్య సన్ని వేసాల రీ షూట్ లో ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్ పై త్వరలో ప్రారంభం కాబోతున్న టాలీవుడ్ సినిమా వర్కర్స్ సమ్మె ప్రభావం కూడ ఉంటుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా చిరంజీవి పుట్టినరోజునాడు విడుదల అయిన వరుణ్ తేజ్ ‘ముకుంద” ఫస్ట్ లుక్ ఫోటోలు కూడా చరణ్ ‘గోవిందుడు’ గెటప్ తో ఉండటం చరణ్ అభిమానులను కొంత గందరగోళంలో పడేస్తోందని ఫిలింనగర్ వర్గాల సమాచారం. ఈ పరిస్థుతులలో చరణ్ గోవిందుడుకు చివరి వరకు సమస్యలు వెంటాడే పరిస్థుతులు కనబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: