నందమూరి సింహం బాలకృష్ణ ‘ఆత్తారింటి’ బ్యూటీ ప్రణితకు అనుకోని షాక్ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి. సత్యదేవా దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమాలో బాలయ్య సరసన త్రిష రోమాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పార్ట్ లో బాలయ్యతో నటించే మరో హీరోయిన్ పాత్రకు కన్నడ బ్యూటీ ప్రణిత ఎంపిక అయింది అనే వార్తలు గత రెండు రోజులుగా ఫిలింనగర్ లో వినిపించాయి. అయితే ఈ సినిమాలో బాలయ్యతో నటించడానికి ప్రణిత అంగీకరించినా పారితోషికం విషయంలో ఈ సినిమా నిర్మాతలకు చుక్కలు చూపించిoదట. అయితే ఈ వార్తలు బాలయ్య దాకా వెళ్ళడంతో కోపగించిన బాలకృష్ణ ప్రణితకు చెక్ పెట్టి తనకు ‘లెజెండ్’ లో కలిసి వచ్చిన రాధిక ఆప్టే వైపు మొగ్గు చూపడమే కాకుండా ఆమెను క్షణాలలో తన కొత్త సినిమా కోసం రెండవ హీరోయిన్ గా దించేసాడు అనే వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో త్వరలోనే రాధిక ఆప్టే జాయిన్ అవుతుందని టాక్. ఈ సినిమా నిర్మాణం వేగంగా పూర్తి చేసి అన్నీ కలిసి వస్తే తనకు ఎప్పుడు కలిసి వచ్చే సంక్రాంతి రేసులో నిలవాలని బాలయ్య ఆలోచన అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: