రామ్ చరణ్ భార్యగా సెలిబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న ఉపాసన అపోలో లైఫ్ మేనేజింగ్ డెరైక్టర్‌ గా తన వ్యాపార భాద్యతలు నిర్వర్తించడమే కాకుండా మూగజీవాల ప్రేమికురాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గాయాల పాలైన జంతువులు, వైకల్యంతో బాధపడుతున్న మూగజీవాలకు నిలువ నీడ కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  అంతేకాదు మోటర్‌కార్ స్పోర్ట్స్ ఎంకరేజ్‌మెంట్‌తో పాటు సేఫ్ డ్రైవింగ్ అవేర్‌నెస్‌ కార్యక్రమాలను ప్రమోట్ చేసేందుకు అపోలో లైఫ్, ఫోక్స్‌వేగన్ పోలో కప్ చాంపియున్ షిప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఉపాసన. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన కొన్ని ఆశక్తికర విషయాలను మీడియాతో షేర్ చేసుకుంది. జంతువులంటే తనకెంతో ఇష్టమని చెపుతూ ఉపాసన తాను ఏదో ఆదర్శం కోసం వాటికి ఆశ్రయుం కల్పించలేదని చెబుతూ తనకు మూగప్రాణులను రక్షించడంలో ఎంతో మానసిక తృప్తి కలుగుతోందని చెప్పుకొచ్చింది ఈ మెగా వారి కోడలు. అంతేకాదు నాగార్జున భార్య తనకు స్పూర్తి దాయకంగా ఉండటమే కాకుండా తనకు ఒక రోల్ మోడల్ గా మారింది అంటూ వ్యఖానించింది ఉపాసన.  ప్రస్తుతం తన ఇల్లు కుక్కలు, గుర్రాలతో ఒక చిన్న జూలా మారిపోయిందని చెపుతూ తన పై తానే సెటైర్లు వేసుకుంది ఉపాసన. 

మరింత సమాచారం తెలుసుకోండి: