ప్రభుదేవాతో బ్రేకప్ అయిన తరువాత కొంత గ్యాప్ తీసుకుని నయనతార తన ప్రేమను కోలీవుడ్ హీరో ఆర్యా వైపు మళ్ళించడానికి ప్రయత్నంచేసింది. అయితే ఇక్కడ నయన్ ఆర్యల ప్రేమ కధకు ఆర్య తల్లి అడ్డు తగలడంతో తల్లికోసం నయన్ ను వదులుకున్నాడు ఆర్యా. అయినా వీరిద్దరి స్నేహం కొనసాగుతూనే ఉంది.  ఆర్య తమ్ముడు సత్య హీరోగా పరిచయం అవుతున్న ‘అమరాకావ్యం’ సినిమాను ఆర్య రిలీజ్ కు ముందు ఒక స్పెషల్ షోను ఏర్పాటు చేసి ఆ షోకు కోలీవుడ్ ప్రముఖులతో పాటు తన మాజీ ప్రియురాలు నయనతారను కూడా ఆహ్వానించాడు. అయితే ఆ సినిమా పూర్తి అయిన తరువాత ఆ స్పెషల్ షోకు వచ్చిన నయనతార అందరూ చూస్తు ఉండగానే ఏడ్వడం కోలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  అంతేకాకుండా ఈ సినిమా చూసి నయనతార చెలించి పోయి చిన్న పిల్లలా ఏడ్చింది అంటూ ‘అమరకావ్యం’ యూనిట్ చేస్తున్న పబ్లిసిటీ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఒక సినిమా అద్భుతం అంటూ ప్రముఖ హీరో హీరోయిన్స్ ఇచ్చిన కామెంట్స్ ను ప్రచారంగా మార్చుకుని పబ్లిసిటీ చేసుకున్న సినిమాలను ఇప్పటి వరకు చూసాం. కానీ హీరోయిన్ ఏడుపును సినిమా పబ్లిసిటీకి ఆయుధంగా వాడుకున్న సాంప్రదాయాన్ని ‘అమరకావ్యం’ సినిమా ద్వారా కోలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఒకనాటి ఆర్య ప్రియురాలు నయన్ కు ఈ ‘అమరాకావ్యం’ సినిమా చూసినప్పుడు తన జీవితంలోని ఏ సంఘటన గుర్తుకు వచ్చి ఏడ్చిందో అంటూ ఆమె పై కోలీవుడ్ మీడియా సెటైర్లు వేస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: