150 సినిమాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు హవా ఇప్పుడు యువతరంలో లేకపోవడంతో దాసరి క్రేజ్ కేవలం ఆయనచేసే సంచలన వ్యాఖ్యలకే పరిమితం అవుతోంది. అయితే నాగార్జున నట వారసుడు నాగచైతన్య దాసరికి మళ్ళీ క్రేజ్ తన సినిమా ద్వారా తీసుకు వస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం నిజం. ఒకప్పుడు దాసరి అక్కినేనిల కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో క్రేజీగా ఉండేది. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు సిల్వర్ జూబ్లీలు కూడ చేసుకున్నాయి. 1983 ప్రాంతంలో దాసరి అక్కినేనిల కాంబినేషన్ లో వచ్చిన ‘రాముడు కాదు కృష్ణుడు’ ఆరోజులలో హిట్ మూవీ. ఆ సినిమాలోని ‘ఒకలైలా కోసం తిరిగాను దేశం’ పాట ఆరోజులలోని యువతరానికి బాగా నచ్చిన పాట. ఈ పాటను అప్పటి యువతరాన్ని దృష్టిలో పెట్టుకుని దాసరి నారాయణరావు రాసారు. అయితే ప్రస్తుతం దాసరి హవా మసగ బారిన నేటి రోజులలో చాలామంది నాగచైతన్య అభిమానులు ఈ పాటను తమ సెల్ ఫాన్స్ కు కాలర్ ట్యూన్ గా పెట్టుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ఇంతకీ విషయం ఏమిటంటే ఆ రోజులలో తన తాత అక్కినేని నటించిన ఒక లైలా కోసం పాటను నాగచైతన్య తన సినిమా టైటిల్ గా మార్చుకోవడమే కాకుండా అదే పాటను సoగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ చేత రీ మిక్స్ చేయించి తన సినిమా కోసం ఉపయోగిస్తూ ఉండటంతో దాసరికి మళ్ళీ క్రేజ్ ను నాగచైతన్య తీసుకు వస్తున్నాడు అంటూ ఫిలింనగర్ లో సెటైర్లు పడుతున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: