సినిమాల జయాపజయాలతో సంబంధం లేకుండా సిద్ధార్ద్ ఎప్పుడూ మీడియాకు హాట్ టాపిక్ గా ఉంటాడు. సిద్ధూ కన్నా ఒక అడుగు ముందు వరసలో మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటుంది సమంత. అటువంటి ఈ ప్రేమ జంట పై మీడియాలో రూమర్లకు కరువు లేదు. అయితే సిద్ధూ తన పెళ్ళి గురించి ఎప్పుడు ఓపెన్ గా చెప్పిన సందర్భాలు లేవు. కానీ అనుకోని ట్విస్ట్ ఇస్తూ సిద్ధార్ధ తాను పెళ్ళికి రెడీ అవుతున్నాని మరో నాలుగు నెలలలో తన పెళ్ళి అని అడగకుండానే తనకు ఎదురు పడ్డ మీడియా వారికి చెప్పి షాక్ ఇచ్చాడు సిద్ధార్ద్. సిద్ధూ లేటెస్ట్ గా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా "జిగార్తండ" ప్రమోషన్ లో భాగంగా ఆ సినిమా గురించి వివరాలు చెపుతూ మధ్యలో మాట మార్చి మరో నాలుగు నెలల్లో తాను పెళ్లి చేసుకుంటున్నా అని మీడియాకు షాక్ ఇచ్చాడు అయితే ఎవర్ని అనే డీటైల్స్ అడిగితే సస్పెన్స్ అని ఆశ్చర్యకరమైన ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చాడని చెన్నై మీడియా టాక్. అయితే సిద్ధూ చెప్పింది నిజమా లేక ఎప్పటిలా జోక్ చేసాడా అనే విషయం పై అర్ధం కాక కోలీవుడ్ మీడియా మొత్తం రకరకాల ఊహలతో వార్తలు రాస్తూ హడావిడి చేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: