మెగా అభిమానులకు ఆగష్టు, సెప్టెంబర్ నెలలు అంటే వారికి ఒక పండుగ. గతవారం చిరంజీవి పుట్టినరోజునాడు సందడి చేసిన మెగా అభిమానులు త్వరలో రాబోతున్న సెప్టెంబర్ 2 గురించి ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజునాడు మెగా స్టార్ 150వ సినిమా గురించి క్లారిటీ వచ్చినట్లుగానే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న పవన్ తన ‘జనసేన’ గురించికాని లేదంటే తన రాబోయే సినిమాల గురించి కాని మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ తన అన్న చిరంజీవి తన పుట్టినరోజునాడు చేసిన పద్ధతినే కొనసాగిస్తడా? లేదాఇదే మౌన రాగాన్ని అనుసరిస్తడా? అనే సస్పెన్స్ మధ్య పవర్ స్టార్ అభిమానులు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ అభిమానులు మాత్రం ఇరు రాష్ట్రాలలోను పవన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని టాక్. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ సినిమాలోని పవన్ ఫస్ట్ లుక్ పవన్ పుట్టినరోజునాడు విడుదల అవుతుంది అనే వార్తలు కూడ ఫిలింనగర్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. తన పెదనాన్న పుట్టినరోజునాడు ‘ముకుంద’ ఫస్ట్ లుక్ ను బయటకు తీసుకు వచ్చిన వరుణ్ తేజ్ తన బాబాయి పుట్టిన రోజునాడు ‘ముకుంద’ ట్రైలర్ ను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్.  గతవారం భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమీత్ షా రాక సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ అదే స్పీడ్ ను కొనసాగిస్తూ మీడియాకు తన పుట్టినరోజు సందర్భంగా ఇంటర్వ్యూలు ఇస్తే అది నిజమైన పండుగగా పవన్ అభిమానులు ఆనందపడే ఆస్కారం ఉంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: