పవన్ రేణుదేశాయ్ ల మధ్య బంధం విడిపోయినా ఆమె తన ఫేస్ బుక్ లో ట్విటర్ లో పవన్ నామస్మరణ చేస్తూ పవన్ అభిమానులతో తన సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. నిర్మాతగా ఇప్పటికే విజయాన్ని అందుకున్న రేణు తాను తొలిసారి దర్శకురాలిగా మారి నిర్మించిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా క్రేజ్ పెంచుకోవడానికి పవన్ ఇమేజ్ ను ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంత వరకు ఉపయోగించుకుంటూ పవన్ క్రేజ్ ను తన సినిమాకు వ్యాపారంగా కూడ కలిసి వచ్చేలా మార్చు కుంటోంది.  ఆమధ్య ఈ సినిమా ఆడియో వేడుకకు పవన్ వస్తాడని ప్రచారం జరిగి పవన్ రాలేక పోయిన విషయాన్ని తెలివిగా పవన్ తన వెన్ను నొప్పి వల్ల రాలేకపోయాడు అంటూ మెసేజ్ లు పెట్టడమే కాకుండా పవన్ సంతకం పెట్టిన ఆ సినిమా సీడీని వెబ్ మీడియాలో పెట్టి తెగ హడావిడి చేసింది. ఇది చాలదు అన్నట్లుగా వచ్చే నెలలో జరగబోతున్న పవన్ పుట్టినరోజునాడు ‘ఇష్క్ వాలా లవ్’ టీజర్ ను విడుదల చేసి పవన్ పుట్టినరోజుకు తన బహుమతి అంటూ మీడియాలో క్రేజ్ కొట్టడానికి మరో పధకం రచిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ రేణుల కొడుకు అకిరా నందన్ పేరిట స్థాపించిన ప్రొడక్షన్ హౌస్ పేరుతో బయటకు వస్తున్న ఈ సినిమా పోస్టర్ల హడావిడికి తోడు పవన్ పుట్టినరోజునాడు విడుదలయ్యే ఈ సినిమా టీజర్ ఏ మాత్రం బాగున్నా పవన్ క్రేజ్ తో భారీ ఓపినింగ్స్ ఈ సినిమాకు వచ్చే అవకాసం ఉన్నాయి అని అంటున్నారు విశ్లేషకులు.   

మరింత సమాచారం తెలుసుకోండి: