ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, నటుడు రిచర్డ్ అటెన్ బరో (90) కన్నుమూశారు. రిచర్డ్ అటెన్ బరో దర్శకత్వం వహించిన గాంధీ (1982) చిత్రానికి 8 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వరించాయి. గాంధీ చిత్రానికి ఉత్తమ చిత్రం, దర్శకుడు విభాగాల్లో రిచర్డ్ అటెన్ బరో ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. రిచర్డ్ అటెన్ బరో (90) 1923వ సంవత్సరం లండన్‌లో జన్మించారు. హాలీవుడ్‌లో నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. తెల్లని గడ్డం, జట్టుతో ఆయన సరికొత్త ఫ్యాషన్‌ ట్రెండ్‌ సెట్‌ చేశారు. దీంతో ఆయన 'డికీ' అనే పేరుతో ప్రాచుర్యం పొందారు. 'ఓ వాట్‌ ఎ లవ్లీ వార్‌', 'చాప్లిన్‌', 'షాడో లాండ్స్‌' తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన నటించిన 'జురాసిక్‌ పార్క్‌', 'మిరాకిల్‌ ఆన్‌ 34 స్ట్రీట్‌' చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే. 2002లో 'పకూన్‌' చిత్రంలో రిచర్డ్‌ చివరిసారిగా కనిపించగా, ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం 'క్లోసింగ్‌ ద రింగ్‌'. రిచర్డ్‌ మృతిపై ఇంగ్లాండ్‌ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ సంతాపం వ్యక్తం చేశారు. 'బ్రైటన్‌ రాక్‌' చిత్రంలో ఆయన నటన అద్భుతం అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: