గత వారం తన పుట్టిన రోజునాడు అభిమానులకు కూడ అందుబాటులో లేకుండా చిరంజీవి నేపాల్ కు వెళ్ళడం చాల మందిని ఆశ్చర్య పరిచింది. అయితే ఆ తరువాత హిమాలయ ప్రాంతమైన ఆదేశంలో ఒక ప్రముఖ ఆలయంలో చిరంజీవి పూజలు చేయించుకోవడానికి ఆట్రిప్ వేసాడు అనే వార్తలు వినిపించాయి.  చిరంజీవి తన పుట్టినరోజునాడు నేపాల్ లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయంలో పూజలు చేయిoచుకుని ఖాళీగా గడపకుండా అక్కడ తన 150వ సినిమాకు సంబంధించిన ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ చిరంజీవి తన కొత్త సినిమా కధలు విన్నాడు అనుకోకండి. ఇప్పటికే పది సంవత్సరాలు వెనక్కు వెళ్ళిన తన లుక్ ను మరింత మెరుగు పరుచుకోవడానికి నేపాల్ దేశంలో ఉన్న పాపులర్ స్పాకు వెళ్లి వయస్సు తక్కువగా ఉండేట్టు చూపే ట్రీట్‌మెంట్ కు సంబంధించి కొన్ని సలహాలు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నేపాల్ దేశంలోని హిమాలయా రిట్రీట్ స్పా అనే ఒక ప్రకృతి వైద్య చికిత్సాలయంలో ఆయుర్వేదిక్ మసాజ్ థెరపీ, హాట్‌స్టోన్ మసాజ్ థెరపీ, రీజువినేషన్ మసాజ్ థెరపీ, స్టీమ్‌బాత్ వంటి విషయాలకు సంబంధించిన కొన్ని సలహాలను తీసుకుని చిరంజీవి మరింత అందంగా కనిపించడానికి ప్రయత్నించాడు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటె చిరంజీవి తన మారిన గెటప్ తో యంగ్ హీరోలకు గట్టి సవాల్ విసిరేలా కనిపిస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: