ఈవారం రాబోతున్న ఆగష్టు 29 జూనియర్ కెరియర్ కు సంబంధించి చాల ముఖ్యమైన రోజుగా మారింది. ఎన్టీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రభస’ విడుదల అవుతున్న తేది అదే. గతసంవత్సర కాలంగా విజయాలకు దూరంగా ఉన్న జూనియర్ కోరికను ‘రభస’ తీర్చ కలుగుతుందా అనే ఆశక్తి కర చర్చల మధ్య ‘రభస’ విడుదల అవుతోంది. ఈ సినిమా ఫలితం ఏ మాత్రం తేడా వచ్చినా జూనియర్ కెరియర్ లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు విశ్లేషకులు.  అయితే అదేరోజు బాలకృష్ణ సినిమా రంగ కెరియర్ కు సంబంధించి ఒక ముఖ్యమైన రోజుగా మారుతోంది. బాలయ్య టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఈ నెల 29 తో నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుని తన 40 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని చేరుకుంటున్నాడు. నందమూరి తారకరామారావు నిర్మించిన ‘తాతమ్మకల’ సినిమా 29.8.1974న విడుదల కావడమే కాకుండా ఆ సినిమా బాలయ్యకు తాను నటించిన ప్రప్రధమ సినిమాగా చరిత్రకెక్కింది. అక్కడ నుండి కొనసాగుతున్న ఈ నందమూరి సింహం హవా నాలుగు దశాబ్దాలు అయినా, ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే అనుకోకుండా ఇప్పుడు ‘రభస’ అదే తేదీన విడుదల కావడం యాదృచ్చికం అనుకోవాలి.  ప్రస్తుతం బాలయ్యా జూనియర్ల మధ్య సంబంధ బాంధవ్యాలు అంతంతమాత్రమే అయినా అబ్బాయి సినిమాకు బాబాయి మొట్టమొదటి సినిమా విడుదలైన తేదీ కవచంలా మారడం జూనియర్ ‘రభస’ ను బాలయ్య ‘తాతమ్మకల’ రక్షిస్తుందా? అనే ఆశక్తికర చర్చలు మీడియాలో జరుగుతున్నాయి. అయితే అసలు ఫలితం మాత్రం వినాయకచవితి నాడు మాత్రమే తేలుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: