సినిమాల మధ్య పోటీ పెరిగి పోవడంతో ఎన్నో అంచనాలతో రిలీజ్ అవుతున్న ‘ఆగడు’ సినిమా ప్రమోషన్ కు ఒక కొత్త మార్గాన్ని ఈ సినిమా నిర్మాతలు ఎంచుకున్నారు. ‘మీలో ఎవరు సూపర్ స్టార్ సూపర్ ఫ్యాన్' అంటూ ఒక కొత్త కాంటెస్టును నిన్న ఈ సినిమా నిర్మాతలు ప్రారంభించారు.  ఇరు రాష్ట్రాలలోని ముఖ్య నగరాలు అయిన వైజాగ్, విజయవాడ, ఖమ్మం, వరంగల్, తిరుపతి, కర్నూలు పట్టణాలలోని ముఖ్య కాలేజీలు షాపింగ్ మాల్స్, థియేటర్ల వద్ద ‘ఆగడు’ వ్యాన్ ఆగుతుంది. యాంకర్స్ మహేష్ బాబు, సినిమాల గురించిన ప్రశ్నలు అడుగుతారు.  సరైన సమాధానాలు చెప్పిన వారు వ్యాన్‍‌లోని కంప్యూటర్లో గేమ్ ఆడే అవకాశం దక్కించుకుంటారు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన వివరాలతో ఈ గేమ్ ఉంటుంది. ఇలా ప్రతి ఊరు సెంటర్ లోను జరిగే కంప్యూటర్ గేమ్‌లో ఎక్కువ స్కోరు చేసిన వారిని ఎంపిక చేసి ఈనెల 30న జరగబోయే ‘ఆగడు’ ఆడియో వేడుకకు ఆహ్వానిస్తారు.  అంతేకాదు అక్కడ మహేష్ బాబుచేత ఒక సూపర్ అభిమానిని ఎంపిక చేసి సూపర్ గిఫ్ట్స్ కూడ ఇస్తారట. యూత్ లో మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఈ వెరైటీ పబ్లిసిటీ కార్యక్రమం ఆగడు కు భారీ ఓపినింగ్స్ ఇస్తుందని ఆశిస్తున్నారు. మరి వీరి ప్రయత్నం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: