టాలీవుడ్ పై కోపం వచ్చి బాలీవుడ్ బాట పట్టి అక్కడ అవకాసాలు వెతుక్కుంటూ రోజులు గడుపుతున్న ఇలియానా ఎన్ని హాట్ ఫోటో షూట్ లు ఇచ్చినా బాలీవుడ్ లో కలిసి రావడం లేదు. దీనితో నిరాశతో ఉన్న ఇలియానా మీడియా కనిపిస్తే చాలు వార్తలలో ఉండటానికి ఎదో ఒక కామెంట్లు చేస్తోంది.  ఈమధ్య ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను హీరొయిన్ గా రాకపోయి ఉంటె ఈపాటికి ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి సీఈఓ గా మారి ఉండేదాన్నని అంటూ ఆ ఇంటర్వ్యు చేస్తున్న వ్యక్తికి మైండ్ బ్లాంక్ చేసింది. దీనికి కారణం ఈ గోవా బ్యూటీకి చిన్నప్పుడు చదువుకునే రోజులలో చాల మంచి మార్కులు వచ్చి చదువులలో నెంబర్ వన్ గా ఉండేదట. అనుకోకుండా మోడలింగ్ లోకి వచ్చి ఆ తరువాత సినిమాలు చేసి తన సాఫ్ట్ వేర్ కంపెనీ కలలు పాడు చేసుకున్నానని ఇలీ బేబి బాధ పడుతోంది. ప్రస్తుతం సినిమాలు లేవు కాబట్టి తన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కంప్యూటర్‌ సైన్స్‌ చదివి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టే ఆలోచనలు ఈమె చేస్తే బాగుంటుందేమో.  ఈ నిరాశ ఇలా ఉండగా ఇలియానా క్రేజ్ జపాన్ ప్రజలకు తాకింది. ఇలియానా నటించిన ‘బర్ఫీ’ సినిమా జపాన్ భాషలోకి డబ్ చేయడంతో బాగా చూస్తున్నారని టాక్. జపాన్ లో వచ్చిన క్రేజ్ తో ఇలియానా సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రయత్నాలు ఆ దేశoలో చేస్తే ఆమె కలలు తీరుతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: