పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరి వెంకటేష్ ని సర్ ప్రైజింగ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన టాక్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరందుకుంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం గోపాల గోపాల లో పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ నిడివిని క్రియేట్ చేశారు. కేవలం 25 నిముషాలకే పవన్ కళ్యాన్ పాత్రని గోపాల గోపాల మూవీలో ఉంటుందంటూ చిత్ర యూనిట్ నుండి, నిర్మాతలు సైతం ఆ విషయాన్ని వెల్లడి చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పై వేసుకున్న లెన్త్ ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి. కొద్ది నిముషాలు మాత్రమే ఉండే పవన్ కళ్యాణ్ రోల్ ని దాదాపు గంట వరకూ పొడిగించనున్నారు. దీంతో గోపాల గోపాల మూవీలో మెయిన్ అట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ ఓ కామన్ మాన్ గా కనిపించనుంటే పవన్ కళ్యాణ్ మోడ్రన్ శ్రీ కృష్ణుడుగా కనిపించనున్నాడు. ఈ సినిమా అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ పాత్ర కేవలం 30 నిమిషాలు మాత్రమే అని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం పవన్ కళ్యాణ్ పాత్ర లెంగ్త్ ని పెంచేశారు. దాదాపు 15 నిమిషాలు పెంచి మొత్తంగా 45 నిమిషాలు ఉండేలా ప్లాన్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నానక్రాంగూడాలో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పాత్రను పెంచుదామని మొదటగా దర్శకుడు కిషోర్ పార్ధసాని వెంకటేష్ కి చెబితే, అందుకు వెంకటేష్ ఆలోచించకుండా సరే అన్నాడంట. దీంతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సీన్స్ ఈ మూవీలో పెరగనున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ తిరిగి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధు శాలిని, దీక్ష పంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: