ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా తను సెలక్ట్ చేసుకుంటున్న మూవీల కథలను చాలా డిప్రెంట్ గా ఉండే విధంగా చూసుకుంటున్నాడు. ముఖ్యంగా తను తీసే మూవీలు రోటీన్ ఎంటర్ట్మైంట్ మూవీలు అయినప్పటికీ అందులోని కథనం తీరు కొత్తగా ఉండేలా ట్రై చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్ లో ప్రారంభమైంది. షూటింగ్ కి సంబంధించిన కొన్ని కీలక సీన్స్ ని సైతం దర్శకుడు చిత్రీకరించాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో మహేష్ బాబు డబుల్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమాలో మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన విషయాన్ని చిత్ర యూనిట్ ని అడిగి తెలుసుకుంటే, వారు విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని చూశారు. కాని మహేష్ బాబు కోరటాల శివ దర్శకత్వంలో ద్విపాత్రభినయం చేస్తున్నాడని బలంగా వినిపిస్తు టాక్స్. మహేష్ బాబు ఇప్పటివరకూ డ్యూయల్ రోల్ చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేయనుందని అంటున్నారు. అప్పటి వరకూ మూవీపై క్రియేట్ చేయటానికి అస్సలు నిజాన్ని చెప్పకుండా అభిమానుల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారని టాక్. సెప్టెంబర్ నుంచి మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: