సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ అంటే అది సమంత అని మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ చెబుతారు. కాని ఫైనాన్షియల్ లెక్కలతో లెక్కేస్తే సమంత కంటే నెంబర్ హీరోయిన్ మరోకొరు ఉన్నారు. తనే టాలీవుడ్ బిగ్ పర్సనాలిటి, అండ్ సెక్సి యోగా టీచర్ అనుష్క. అవును 2014వ సంవత్సరం ఆదాయానికి సంబంధించిన లెక్కలను ముందుగానే చూసుకుంటే అనుష్క సంపాదన దాదాపు 15 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇదంతా కేవలం మూవీలు, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవాలు, బ్రాండింగ్ తరహా క్యాంపెన్ లతోనే వచ్చిన సంపాదనగా లెక్కతేలిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు అత్యధికంగా సంపాదిస్తున్న హీరోయిన్స్ అన్న దానిపై కోలీవుడ్ లో తాజాగా ఓ మ్యాగజైన్ సర్వే నిర్వహించింది. అందుకులో అనుష్క మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానంలో సమంత వచ్చింది. ప్రస్తుతం అనుష్క సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు. అనుష్క తెలుగు మరియు తమిళంలో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. అనుష్క తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలైన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాల్లో నటిస్తుంటే, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన ‘లింగా’, అజిత్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఈ నాలుగు క్రీజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న అనుష్క గత సంవత్సర కాలంగా కాస్త గ్యాప్ కూడా తీసుకోలేదు. ఈ నాలుగు ప్రాజెక్ట్స్ వాల్యూ, అలాగే ప్రవేట్ కంపెనీలకు బ్రాండింగ్ అంబాసిడర్, అలాగే షాపింగ్ మాల్స్ కి బ్రాండింగ్ గా ఉంటూ దాదాపు 2014వ సంవత్సరానికి తన ఆదాయాన్ని ముందుగానే లెక్కగట్టి, ఆ సర్వే ముందుపెట్టింది. మొత్తంగా అనుష్క డిమాండ్ ఏ రేంజ్ లో ఉందే, దీన్ని బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: