బాలీవుడ్ అందాల రాసి దీపిక పదుకునే నటిస్తున్న ‘ఫైండింగ్ ఫన్నీ' మూవీ వల్గర్ దుమారంలో చిక్కుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈసినిమాలో దీపిక, అర్జున్ కపూర్ ల మధ్య జరిగే సంభాషణలో దీపిక తాను ‘వర్జిన్' అని చెప్పిన డైలాగ్ విషయంలో వివాదం ఏర్పడి సెన్సార్ ఆడైలాగ్ ను తీసివేయమని ఈ సినిమా నిర్మాతలను ఆదేసించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ సినిమా దర్శకుడు హోమి అదజనియా ఆ డైలాగ్ లో అసభ్యత ఏమిటి అంటూ మీడియా ముందు తన బాధను వ్యక్త పరుస్తున్నాడు. అంతేకాదు గతంలో వచ్చిన చాల బాలీవుడ్ సినిమాలలో ఈ డైలాగ్ వాడారని అతడి వాదన. ఆ మధ్య వచ్చిన ‘దిల్ సె' చిత్రంలో అదేవిధంగా ఈ మధ్య వచ్చిన ‘2 స్టేట్స్' చిత్రంలో వర్జిన్ అనే డైలాగ్ వాడారని ఆ సినిమాలకు లేని అభ్యంతరం తన సినిమాకు ఏమిటి అనీ ఈ దర్శకుడు గగ్గోలు పెడుతున్నాడు. బహుశ దీపిక్ లాంటి అందమైన అమ్మాయి నోటి వెంట ఇటువంటి వల్గర్ డైలాగ్ రావడం సెన్సార్ బోర్డు వారు కూడ భరించలేక ఇటువంటి అభ్యంతరం చెప్పి ఉంటారు. ఇప్పటిదాకా గ్లామర్ డాల్ లా మెరిసిన దీపిక ఈ సినిమాలో ఒక విడో పాత్రలో కనిపించడం బాలీవుడ్ మీడియాను ఆశ్చర్య పరుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: