సామాన్యంగా ఆడియో ఫంక్షన్స్ కు హీరోలను దర్శకులను అతిధులుగా పిలుస్తూ ఉంటారు. అయితే గోల్డెన్ లెగ్ బ్యూటీ కాజల్ ను ఒక చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ కు పిలిచారు. అనుకోని గౌరవానికి పొంగిపోయిన కాజల్ పిలిచినదే తడవుగా ఆ ఆడియో వేడుకకు అతిధిగా ఆ ఫంక్షన్ కు వచ్చింది. ఫంక్షన్ ప్రారంభం అయ్యాక కాజల్ కు అసలు విషయం తెలిసి టెన్షన్ మొదలైంది అని న్యూస్. కాజల్ ఎంతో మోజుతో హాజరు అయిన ఆ సినిమాపేరు ‘పిచ్చెక్కిస్తా' కొత్త హీరో హీరోయిన్ లు ఎన్.కె, హరిణి జంటగా బి.శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఒక చిన్న బడ్జెట్ సినిమా.  అంతవరకు బాగానే ఉంది కాని ఈ సినిమాలో బూతు కంటెంట్ ఎక్కువగా ఉంటుందని వేదక పైకి ఎక్కిన తరువాత కాని కాజల్ కు తెలియ లేదట.  తాను అతిధిగా వచ్చి ఇటువంటి సినిమాను ప్రోమోట్ చేస్తునానా అంటూ వేదకపై కాజల్ తెగ టెన్షన్ పడిపోయిందని ఆ ఆడియో ఫంక్షన్ కు వెళ్ళిన వారు కాజల్ పై జోక్స్ వేస్తున్నారు.  లోపల టెన్షన్ పెరుగుతున్న కాజల్ వేదిక పై మైక్ దగ్గరకు వచ్చి తన దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. సినిమా ఏదైనా కష్టపడటం మీదే ఫలితం ఆధార పడి ఉంటుంది అంటూ భారీ డైలాగులు చెప్పి ఆడియో వేడుకలో కాజల్ నటించింది అంటూ ఆమె పై సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: