చిరంజీవి 150వ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళడం ఖాయం అని తేలిపోవడంతో ఈ సినిమా నిర్మించబోతున్న రామ్ చరణ్ పై ఒక విచిత్రమైన ఒత్తిడి వస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి. ఇంతకు వచ్చి కధ విషయంలో కాని దర్శకుడి విషయంలో కాని క్లారిటీ లేని ఈ 150వ సినిమాలో అవకాశం ఇప్పించమంటూ చరణ్ పై శ్రియ, టబు, లతో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోన్ కూడ చెర్రీకి తమతమ స్థాయిలలో సందేశాలు పంపుతూ చరణ్ ను ఖంగారు పెడుతున్నారని టాక్. ఇది ఇలా ఉండగా కన్నడ బ్యూటీ ప్రణిత కూడ చిరంజీవి 150వ సినిమా పై కన్నేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి, చరణ్ ల మనసులో ఉన్న నయనతార, అనుష్కలు మాత్రం చరణ్ వద్ద తమను తాము ప్రమోట్ చేసుకోవడం లేదు అనే వార్తలు కూడ ఉన్నాయి.  ఈ వార్తలు ఇలా ఉండగా మెగా కాంపౌండ్ కు అత్యంత సన్నిహితుడు వివి.వినాయక్ చిరంజీవికి రకరకాల కధలు వినిపించి అలిసిపోయి ఈ మధ్య మెగా కాంపౌండ్ మెట్లు ఎక్కడం కూడ మానేసాడు అనే వార్తలు ఉన్నాయి. పూర్తిగా కధ కూడా సిద్దం కాని చిరంజీవి సినిమా కోసం హీరోయిన్స్ మధ్య జరుగుతున్న రగడకు సంబంధించిన వార్తలను బట్టి చరణ్ నిర్మాతగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అర్ధం అవుతోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: