కన్నడ సినిమా రంగంలో ఒక ప్రముఖ స్థానంలో కొనసాగుతున్న ఒక ప్రముఖ దర్శకుడి రాసలీలలను నిన్న ఒక ప్రముఖ ఛానల్ బయట పెట్టి సినిమా రంగంలోని మరో చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది ఆ ఛానల్. ఆ దర్శకుడు తన దగ్గరకు సినిమా అవకాశాలకోసం తన దగ్గరికి వచ్చే వారిని మాటలలో పెట్టి ఎలా ట్రాప్ చేస్తున్నాడో వివరంగా వరించింది ఆ ఛానల్. ఒక్క ఛాన్స్ కావాలంటూ తనదగ్గరి కొచ్చే వారిని నయాన్నో భయాన్నో లొంగ తీసుకోవడం ఆ దర్శకుడి అలవాటు అట. ఇండస్ర్టీలో ఉన్న పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరూ ఒకప్పుడు తనతో శృంగారానికి అంగీకరించిన వాళ్లేనని చెపుతూ తన దగ్గరకు వచ్చిన అమ్మాయిల బ్రెయిన్ వాష్ చేయడం అతని అలవాటు అని ఆ ఛానల్ ఆశక్తి కర కధనాన్ని ప్రసారం చేసింది. ఇంతమంది యువతులతో ఆటలు ఆడుకుంటున్న ఆ ప్రముఖ కన్నడ దర్శకుడి పేరు ఓంప్రకాశ్ రావు అని ఆ ఛానల్ కధనం. ఇతడి వ్యక్తిగత ప్రవర్తన పై ఆ ప్రముఖ ఛానల్ కు ఫిర్యాదులు అందటంతో ఆ ఛానల్ స్వయంగా రంగంలోకి దిగి ఈ స్టింగ్ ఆపరేషన్‌ లో అతడు హీరోయిన్స్ గురించి అసహ్యంగా, అసభ్యంగా మాట్లాడుతున్న దృశ్యాలు ఆ ఛానెల్ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.  కన్నడ సినిమా రంగంలో పెను ప్రకంపనాలు సృస్టించిన ఈ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ ప్రస్తుత సినిమారంగంలోని యదార్ధ పరిస్తితులను ప్రతిబింబిస్తోoది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: