ఇండియన్ ఫిల్మ్ సూపర్ స్టార్ గా అఖండ అభిమానుల నీరాజనాలను అందుకుంటున్న హీరో రజనీకాంత్. రజనీకాంత్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ లింగా. ప్రస్తుతం లింగా మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరగుతుంది. నేడు వినాయక చతుర్ధి సందర్భంగా లింగా మూవీకి సంబంధించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ఫోటోలో రజనీకాంత్ ఫుల్ ఎనర్జిటిక్ గానూ, ఫుల్ ఎమోషన్స్ ని చూపించే విధంగానూ ఉన్నాడు. పోస్టర్ లో రజనీకాంత్ నడుస్తూ ఇచ్చిన ఫోజ్ అభిమానులను మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకులని సైతం అలరిస్తుంది. కోలీవుడ్ లో అయితే రజనీకాంత్ అప్ కమింగ్ ఫిల్మ్ లింగా మూవీ లుక్ చూసి కేక అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీని కె.యస్.రవికుమార్ అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నడు. రజనీకాంత్ సరసన హీరోయిన్ గా అనుష్క, సోనాక్షి సిన్హా చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం లింగా మూవీకి సంబంధించిన షూటింగ్ కర్ణాటకలో జరుగుతుంది. ఈ చిత్ర తాజా షెడ్యూల్ కర్నాటకలోని శిమోఘ జిల్లాలో బాగా ఫేమస్ అయిన లింగనమక్కి డామ్ వద్ద షూటింగ్ జరుగుతోంది. కానీ ఆ డామ్ ని పొల్యూట్ చేస్తున్నారని కమీషనర్ కి కంప్లైట్ వెళ్ళడంతో షూటింగ్ ఆగిపోయింది. అసలు విషయంలోకి వెళితే .. లింగనమక్కి డామ్ వద్ద షూటింగ్ జరుగుతున్న టైములో ఈ చిత్ర టీం డామ్ సురక్షితంగా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాళ్ళు వాడిన ప్లాస్టిక్, ఇతర చెత్త చెదారాలతో పొల్యూట్ చేస్తున్నారని అక్కడి పర్యావరణవేత్తలు డిప్యూటీ కమీషనర్ కి కంప్లైట్ ఇవ్వడంతో షూటింగ్ ని వెంటనే ఆపేశారు. చిత్ర నిర్మాత దీనికి సంబంధించిన సమస్యను త్వరగా పరిష్కరించుకునే దశలో ప్రయత్నాలు చేస్తున్నడు.

మరింత సమాచారం తెలుసుకోండి: