పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చిన తరువాత నుండి ఇప్పటి వరకూ ఎన్నో రికార్డ్స్ ని క్రియోట్ చేశారు. బ్రేక్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ మొదటి సారిగా నెగిటివ్ రికార్డ్ ని క్రియోట్ చేశారంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వరుస ప్లాపుల తర్వాత గ్రాండ్ సక్సెస్ ని తెచ్చిన మూవీ ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘గబ్బర్ సింగ్ 2′ను అనౌన్స్ చేశాడు పవర్ స్టార్. అయితే గబ్బర్ సింగ్ 2 డైరెక్టర్ అందరూ హరీష్ శంకర్ అనుకుంటే, పవన్ మాత్రం సీక్వెల్ కి స్క్రీన్ ప్లేను మార్చి డైరెక్టర్ గా సంపత్ నందిని ఓకే చేశాడు. ఇదిలా ఉంటే గబ్బర్ సింగ్2 మూవీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తుంది. గత రెండేళ్ళుగా ‘గబ్బర్ సింగ్ 2′ స్క్రిప్ట్ తో కాలక్షేపం చేస్తున్న దర్శకుడు సంపత్ నంది, పవన్ చేత సినిమా ముహూర్తానికి హాజరయ్యేలా చేయగలిగాడు కాని, షూటింగ్ ని సెట్స్ మీదకు తీసుకురాలేకపోయాడు. అలాగే కనీసం ఈ ప్రాజెక్ట్ కి హీరోయిన్ ఎవరో కూడా తేల్చుకోలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ నటించిన మూవీలలో దాదాపు 2 సంవత్సరాల వరకూ స్టార్ కాని మూవీ కేవలం గబ్బర్ సింగ్ 2 మాత్రమే అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ మూవీ తరువాత ‘గబ్బర్ సింగ్ 2′ రెగ్యులర్ షూటింగ్ ఉంటుందా? ఉండదా? అనేదానిపై ఇంకా క్లారిటి రాలేదు. పవన్ కు ఇష్టమైన రాజకీయ నాయకుడు జగ్గారెడ్డి బిజెపిలో చేరి, మెదక్ ఉప ఎన్నికల బరిలో దిగుతున్నారు. ‘గోపాల గోపాల’ షూటింగ్ కంప్లీట్ చేసి జగ్గారెడ్డికి మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం చేస్తారని సమాచారం. ఇదే జరిగితే గబ్బర్ సింగ్ 2 ప్రాజెక్ట్ మరో రెండు నెలలు వెనక్కి వెళ్ళినట్టేనని అంటున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఓ నెగిటివ్ రికార్డ్ ని క్రియోట్ చేసుకున్నాడని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: