మొన్న వినాయక చవితి రోజున విడుదలైన ‘రభస’ ముందు నుంచి ఊహిస్తున్నట్లుగానే డివైడ్ టాక్ తెచ్చుకుని జూనియర్ ‘బాదుషా’ తొలిరోజు రికార్డులను బ్రేక్ చేయలేక పోయింది. ఒకవైపు వినాయక చవితి హడావిడి మరొక వైపు ఇరు రాష్ట్రాలలోను కురుస్తున్న భారీ వర్షాలు జూనియర్ ‘రభస’ ఓపెనింగ్ రికార్డులను దెబ్బతీసాయి అని అంటున్నారు.  అయినా ఇన్ని వ్యతిరేక పరిస్తుతులను ఎదుర్కుని ‘రభస’ ఆల్ టైమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ లిస్టు లో మూడవ స్థానంలో నిలిచి జూనియర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ను మరోసారి ఋజువు చేసింది. ఈ వార్తలు ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా విడుదలైన మొదటి రోజునే నైజాం ఏరియాలో మొదటి రోజు 2 కోట్ల 43 లక్షల షేర్ సాధించిన సినిమాగా ‘రభస’ రికార్డులు క్రియేట్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి.  డివైడ్ టాక్ తెచ్చుకుని కూడ ఈ స్థాయిలో ‘రభస’ కలెక్షన్స్ హవా నడవడం బట్టి బయ్యర్లకు ‘రభస’ భయ పడినంతగా చేదు అనుభవం ఇవ్వదు అనే విశ్లేషణలు కూడ ఉన్నాయి. వర్షాల తాకిడి లేకుంటే ‘రభస’ సినిమా నిజంగానే కలెక్షన్స్ రభస చేసి ఉండేదని టాక్. నేటితో వీకెండ్ ముగిసి పోతూ ఉండటంతో ‘రభస’ అసలు పరిస్థితి పై రేపటి నుంచి అసలు విషయం బయట పడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: