తన పెదనాన్న చిననాన్నల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ మెగా హీరో వరుణ్ తేజ్ నిన్న అమలాపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే అవి నిజమైన ఎన్నికలు కావు. వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ముకుంద’ సినిమా కోసం నిన్న అమలాపురంలోని గారపాటివారి వీధిలో ఇంటింటికీ వెళ్లి వరుణ్ తేజ్ ఓట్లు అభ్యర్థిస్తున్న సన్నివేశాలను షూట్ చేశాడు ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలోని కధానుసారం మున్సిపల్ ఎన్నికల కోసం ఈ సినిమాలోని హీరోయిన్ పూజ హెగ్డే తన తండ్రి రావ్ రమేష్ కోసం ప్రచారం చేస్తూ ఉంటే అదే ఎన్నికల కోసం తన తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వరుణ్ తేజ్ ఎదురుపడే సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించాడు అని తెలుస్తోంది. అదేవిధంగా కాపు కళ్యాణ మండపం దగ్గర భోగి మంట వేసి ఆ మంట వద్ద ‘రాజకీయ కాలుష్యం ఈ మంటల్లో కడతేరిపోవాలి’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగులు కూడ చిత్రీకరించారు. మెగా కుటుంబ హీరోలకు అమలాపురం ప్రాంతంలో గట్టి పట్టు ఉండటంతో ఈ షూటింగ్ ను చూడటానికి నిజమైన ఎన్నికలు జరుగుతున్నాయా అని అనిపించేడట్లుగా జనం రావడం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. బయట రాజకీయాలలో కాకపోయినా తన కుటుంబ వారసత్వాన్ని వరుణ్ తేజ్ వెండి తెర పై కొనసాగిస్తున్నాడు అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: