వరుస పరాజయాల తరువాత గోపీచంద్ ‘సాహసం’ ద్వారా తిరిగి వెలుగులోకి వచ్చి కొద్దిగా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘లౌక్యం’ రొటీన్ ఫార్మలా సినిమాలు తీసే శ్రీవాస్ దర్శకత్వంలో సూపర్ హిట్ కొట్టాలి అనే లక్ష్యంతో తీస్తున్న సినిమా ‘లోక్యం’ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్స్ చూస్తూ ఉంటే ఇది మామూలు రొటీన్ సినిమా అని అనిపించేడట్లుగా ఉంది. అయితే ఇటువంటి రొటీన్ సినిమాను ఈ నెలలో టాప్ క్రేజీ హీరోల సినిమాల మధ్య పోటీగా విడుదల చేయడం అందర్నీ ఆశ్చర్య పరచడమే కాకుండా గోపీచంద్ ఈ సాహసం ఎందుకు చేస్తున్నాడు అనే సందేహాన్ని కలిగిస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఈ సెప్టెంబర్ నెల టాలీవుడ్ నిర్మాతలకు 200 కోట్ల జూదంగా మారిన నేపధ్యంలో మార్కెట్ లేని గోపీచంద్ ఈ నెలనే తన సినిమాకు ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయం చాలామందికి ప్రశ్నగా మారింది. ఈ నెల మొదటి వారంలో ‘పవర్’ వస్తుంటే సెప్టెంబర్ 19న ‘ఆగడు’ హడావిడి మొదలవుతుంది. ఆ తరువాత కేవలం రండు వారాల గ్యాప్ తో చరణ్ ‘గోవిందుడు’ అక్టోబర్ 1న రాబోతోంది. ఇన్ని భారీ సినిమాల నడుమ మిగిలి ఉన్న సెప్టెంబర్ ఆఖరి వారం 26వ తారీఖున ‘లౌక్యం’ విడుదల అవుతుంది అని వార్తలు రావడం ఈ సినిమాను కొందామని ఆశ పడుతున్న బయ్యర్లకు షాకింగ్ న్యూస్ గా మారడమే కాకుండా అశలు గోపీచంద్ కు ఏమైంది అంటూ సెటైర్లు పడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: