టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నా ఛార్మీకి ఇప్పటికి కూడ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వల్లే తన సినిమాలు పెద్దగా ఆడక పోయినా సెలెబ్రెటీగా టాలీవుడ్ లో బతికేస్తోంది ఛార్మీ. నిన్న మరణించిన తెలుగు సినిమా కీర్తి శిఖరం బాపూకు ఛార్మీ తాను స్వయంగా ఒక ఎనిమిది పేజీల ప్రేమలేఖ రాసానని ఛార్మీయే స్వయంగా చెపుతోంది.  బాపు కొన్ని సంవత్సరాల క్రితం ఛార్మీతో ‘సుందరకాండ’ సినిమాను తీసారు. ఈ సినిమా షూటింగ్ విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో జరుగుతున్నప్పుడు ఛార్మీకి బాపు బస చేసిన హోటల్ లోనే ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసారట ఫిలిం యూనిట్. అయితే ఆ హోటల్ అంత సౌకర్యవంతంగా లేకపోవడంతో ఛార్మీ ఆ హోటల్ లో పడుతున్న పాట్లు గమనించిన బాపు, ఆమె హోటల్ గదిలో దుప్పట్లు, గలేబులు మార్పించడం దగ్గర నుంచి అన్ని విషయాలు ఒక స్నేహితుడిలా చూసుకోవడమే కాకుండా ఆ సినిమా షూటింగ్ సందర్భంలో తనకు జ్వరం వచ్చినప్పుడ ప్లేటులో అన్నం వడ్డించి తనకిష్టమైన ఆవకాయ పచ్చడితో కలిపి తనకు ఒక ప్రియ స్నేహితుడిలా ముద్దలు తినిపించాడని ఛార్మీ చెపుతోంది. ఆ షూటింగ్ సమయంలో బాపూకు అతి తక్కువ సమయంలో చేరువ కావడమే కాకుండా తనకు ప్రియ స్నేహితుడిగా బాపు మారిపోయారని ఛార్మీ అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. ఈ చిత్రం విడుదల అయ్యాక అ సినిమా విజయం అనుకున్న ఫలితాన్ని ఇవ్వక పోయినా బాపు మీద ఉండే అభిమానంతో ఆయన ఫై తనకు ఉన్న భావాలను అక్షరాలుగా మార్చి ఎనిమిది పేజీల ఉత్తరాన్ని బాపూకు ఇష్టమైన ‘కొనియాక్’ బ్రాండ్ మద్యం బాటిల్ తో పంపిందట ఛార్మీ. అయితే ఆ ఉత్తరం చదివి బాపు తనకు ఫోన్ చేస్తారని చాల రోజులు ఎదురు చూసి బాపు నుండి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో తనే ఫోన్ చేసి ఆ ఉత్తరం చదివారా అని అడిగిందట ఛార్మీ. అయితే మంచి హాస్య ప్రియుడైన బాపు ‘సుందరకాండ పోయింది కదా నీవు తిడుతూ రాసావేమోనని ఆ ఉత్తరం చదవలేదు దేవుడి దగ్గర పెట్టేసా’ అని సెటైర్ వేసారట బాపు. దానితో షాక్ కు గురైన ఛార్మీ తాను కష్టపడి రాసిన ప్రేమలేఖ బాపు చదవనందుకు తెగ బాధ పడిందట ఛార్మీ.  

మరింత సమాచారం తెలుసుకోండి: