ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ట్విట్టర్లో తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆశక్తిని కలిగిస్తున్నాయి. పవన్ తనకు గురువు లాంటి వాడని ఆయన ద్వారానే సినిమా రంగానికి సంబంధించి ఎన్నో విషయాలను తాను నేర్చుకున్నానని అంటూ తాను ఫిలిం మేకర్ గా మారడానికి వెనుక ఉన్న శక్తి పవన్ అంటూ వ్యాఖ్యలు చేసింది రేణుదేశాయ్. ‘అనుకోకుండా జరిగే కొన్ని పరిణామాలు మన ఆలోచనలకు దేవుడు ఇచ్చే సమాధానాలు’ అంటూ తన వ్యక్తిగత జీవితం పై భావయుక్తంగా ట్విట్ చేసింది రేణు. ఈరోజు పవన్ పుట్టినరోజు సందర్భంగా రేణు తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఇష్క్ వాలా లవ్' టీజర్ విడుదలను పురస్కరించుకుని రేణు దేశాయ్ ఈ ఆ శక్తికర వ్యాఖ్యలు చేసింది.  మొన్నటి వరకు భర్తగా ఉన్న పవన్ నేడు రేణుకు బెస్ట్ టీచర్ గా మారడం ఆశ్చర్యం కలిగించే విషయం. పవన్ తో తన వైవాహిక సంభందాలు తెగిపోయిన తరువాత కూడా అనునిత్యం రేణు పవన్ నామ స్మరణ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆగస్టు 26న న విడుదల కావాల్సిన తన సినిమా ఫిల్మ్ టీజర్ టెక్నికల్ సమస్యల వల్ల సెప్టెంబర్ 2న విడుదల అవుతుడటం దేవుడి నుండి తనకు అందిన స్ట్రాంగ్ సిగ్నల్‌లా భావిస్తూ పవన్ పై రేణు చేస్తున్నవ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా భవిష్యత్ లో ఇంకా ఎన్ని సంచలనాలకు తెర తీస్తుందో అన్న చర్చలకు తావిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: