ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి’ వచ్చే సంవత్సరం విడుదల అవుతున్నా ఆ సినిమా ప్రభావం అనుకోకుండా మహేష్ నటిస్తున్న ‘ఆగడు’ సినిమా పై పడింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ వార్తల వివరాలలోకి వెళితే మహేష్ బాబు నటించిన ‘ఆగుడు' మూవీ ఆడియో వేడుకకు రావలసిన హీరోయిన్ తమన్నా రాకపోవడం వెనుక ప్రభాస్ ‘బాహుబలి’ కీలక పాత్ర పోషించింది అనే వార్తలు వస్తున్నాయి. తమన్నా ‘ఆగడు’ ఆడియో వేడుకలో కనిపించక పోవడంతో రకరకాల ఊహగానలు హల్ చల్ చేసాయి. అయితే అసలు విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. తమన్నా నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ మహాబలేశ్వర్‌లో ఒక్కరోజు గ్యాప్ కూడ లేకుండా జరుగుతూ ఉండటంతో తమన్నా ఎంత ప్రయత్నించినా ‘ఆగడు’ ఆడియో వేడుకకు రాలేక పోయింది అని టాక్. రాజమౌళి ఈ సినిమా షూటింగ్ వేగం పెంచడంతో ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులకు ఒక్క క్షణం కూడ తీరిక ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల కారణం వల్లనే ఆఖరి నిముషంలో తమన్నా ‘ఆగడు’ ఆడియో ఫంక్షన్ మిస్ అయింది అని అంటున్నారు. ఎదిఎమైనా అనుకోకుండా మహేష్ కు ప్రభాస్ వల్ల గట్టి షాక్ తగిలింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: