రవితేజ ‘పవర్’ కు సెన్సార్ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను ఈ వారం సెప్టెంబర్ 5న విడుదల చేయాలని ఈ సినిమా యూనిట్ చేసిన ప్రయత్నాలకు సెన్సార్ షాక్ తగిలింది అని అంటున్నారు. దీనికి కారణం సెన్సార్ అధికారులు ఈ సినిమాను సెన్సార్ స్క్రీనింగ్ చేయడానికి మరో రెండురోజుల వరకు వాయిదా వేసిందని ఫిలింనగర్ టాక్. దీనితో ‘పవర్’ రిలీజ్ మరోవారం వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ గాసిప్ ల హడావిడి మొదలైంది. నిన్న జరగ వలసిన ‘పవర్’ సెన్సార్ కార్యక్రమం అవ్వక పోవడంతో ఈ వార్తలు ఊపు అందుకున్నాయి. అయితే సెన్సార్ కారణాలు వాస్తవం కాదని ‘పవర్’ వాయిదా వెనుక దిల్ రాజ్ హస్తం ఉంది అనే వార్తలు కూడ ఉన్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ‘రభస’ బయ్యర్లకు మాత్రం ఈ వార్త ఊరట ఇస్తుంది అని అంటున్నారు. పెద్ద సినిమాలు ఏమిలేని ఈ వారంలో హడావిడిగా నాగచైతన్య ‘ఒక లైలా కోసం’ ఈ వీకెండ్‌కు వస్తుందా అన్న ప్రశ్నకు ఈరోజు క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. ఏమైనా రవితేజ పవర్ కు ఊహించని షాక్ తగిలింది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: