హీరో శివాజీకి మంచి నటుడిగా పేరున్నా ప్రస్తుతం నడుస్తున్న టాప్ హీరోల భారీ సినిమాల సునామి ముందు శివాజీ సినిమాలు కనీసం ఒక మాదిరిగా కూడ నిలబడ లేకపొతున్నాయి. ఈ పరిస్థుతులలో శివాజీ సినిమాలు ఎప్పుడు వచ్చి వెళ్ళి పోతున్నాయో కూడ తెలియని విచిత్ర పరిస్థుతులలో శివాజీ సినిమా కెరియర్ ఉంది.  ఈ వారం చాలామంది కమెడియన్స్ తో కలిపి ఒక వెరైటీ సినిమాగా ముందుకు వస్తున్న ‘బూచమ్మా బూచోడు’ సినిమాలో శివాజీ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శివాజీ ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ సినిమాలు నిర్మిస్తున్న బడా ప్రొడ్యూసర్స్ పై ఘాటైన సెటైర్లు వేసాడు.  50 కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న భారీ సినిమాలు చాలమటుకు పరాజయం చెందడంతో కనీసం 30 కోట్లు కూడ వసూలు చేసుకోలేని విచిత్ర పరిస్థుతులలో నేటి టాలీవుడ్ భారీ నిర్మాతలు ఉన్నారని కామెంట్లు విసిరాడు శివాజీ. 50 కోట్ల సినిమాకు 30 కోట్లు వసూలు అయినా అ సినిమా ఘన విజయం సాధించిందని సక్సస్ మీట్లు పెడుతూ అదే నిర్మాత మరో టాప్ హీరోతో మరో భారీ సినిమాను ప్రకటించడం ఒక విష సంస్కృతిగా మారి చిన్న సినిమాలను నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్త పరిచాడు శివాజీ. ఒక చిన్న సినిమాను నిర్మించిన నిర్మాత అదృష్టం కలిసి వచ్చి అ సినిమా హిట్ అయితే మరో చిన్న సినిమా నిర్మించకుండా వెంటనే భారీ సినిమాల వైపు పరుగులు తీయడంతో అటు నిర్మాతకు ఇటు చిన్న సినిమాల కళాకారులకు పెద్ద దెబ్బగా మారుతోందని అంటూ ఈ భారీ సినిమాల సంస్కృతి టాలీవుడ్ ను షేక్ చేయడమే కాకుండా ఎందరో నిర్మాతల జీవితాలను నాశనం చేస్తోంది అని ఆవేదన పడుతున్న శివాజీ మాటలు ఏ భారీ నిర్మాతైనా వింటాడా అన్నదే ప్రశ్న.  

మరింత సమాచారం తెలుసుకోండి: