చెన్నై బ్యూటీ కలలో కూడ ఊహించని అదృష్టం ఆమెను ఆశ్చర్య పరుస్తోంది. కొన్నాళ్ళ క్రితం టాలీవుడ్ కోలీవుడ్ లలో టాప్ హీరోయిన్ స్టేటస్ అనుభవించిన త్రిష కొత్త హీరోయిన్స్ హవాతో పూర్తిగా మరుగున పడిపోయింది. దీనితో ఆమె వైపు యంగ్ హీరోలు చూడటం మానేశారు. ఈమధ్యన త్రిష సినిమాల వార్తల కంటే త్రిష, రానాల మధ్య ప్రేమ వ్యహారం పై వార్తలే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెకు అనుకోకుండా కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన బంపర్ ఆఫర్ ఆమెను తిరిగి టాప్ హీరోయిన్ స్టేటస్ కు తీసుకు వెళుతుందని ఆమె కూడ ఊహించుకుని ఉండదు. కన్నడ ప్రేక్షకులు పవర్ స్టార్ గా ఆరాధించే పునీత్ రాజ్ కుమార్ సరసన ఈమె నటించిన ‘పవర్’ గత వారం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కన్నడ సినిమా రంగంలో కలెక్షన్స్ రభసను సృష్టిస్తోంది. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘దూకుడు’ సినిమాకు రీమేక్. అయితే ఆశ్చర్య పరిచిన విషయం ఏమిటంటే త్రిషను మూడు పదుల వయసు దాటిపోయిన బ్యూటీగా మన తెలుగు ప్రేక్షకులు లిస్టు లోంచి తీసివేస్తే త్రిష గ్లామర్ ను చూసి కన్నడ ప్రేక్షకులు ఫిదా అయిపోవడం ఈ విషయంలో ట్విస్ట్.  బాలకృష్ణ కొత్త సినిమాలో ఆ సినిమా నిర్మాతల దగ్గర కోటి రూపాయలు ముక్కు పిండి వసూలు చేసిన త్రిష ఈ కన్నడ ‘పవర్’ లో కేవలం 25 లక్షలు పుచ్చుకుని నటించింది అంటే ఎవ్వరు నమ్మలేని నిజం. ఏమైనా త్రిష కెరియర్ కు మరొకసారి ప్రిన్స్ మహేష్ బాబు టర్నింగ్ ఇచ్చాడు అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: