నాలుగు పదుల వయసు దాటిపోయిన హీరోలకు హీరోయిన్స్ దొరకడం కష్టమైపోతున్న నేటిరోజులలో మాస్ మహారాజ రవితేజాకు మాత్రం యంగ్ హీరోయిన్స్ రవితేజాకు చిరునామాగా మారిపోతున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ తో యూత్ లో మంచి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రవితేజ పిలవగానే రొమాన్స్ కు సిద్ధం అవుతోంది.  మాస్ మహారాజా సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న ‘కిక్ 2’ కు హీరోయిన్ గ ఎంపిక అయింది అనే వార్తలు వస్తున్నాయి. దీనితో యంగ్ హీరోయిన్స్ కు రవితేజ యంగ్ మరియు టాప్ హీరోల మధ్య వారధిలా మారాడు అనే సెటైర్లు పడుతున్నాయి. ఈ వారం విడుదల కాబోతున్న ‘పవర్’ సినిమా ద్వారా రెజీనాకు బ్రేక్ ఇవ్వబోతున్న రవితేజా ‘కిక్ 2’ ద్వారా రకుల్ ప్రీత్ సింగ్ కు గాడ్ ఫాదర్ గా మారబోతున్నాడు. తాము నటించిన సినిమాలు విజయవంతం అయినా టాప్ యంగ్ హీరోల దృష్టిని ఆకర్షించలేకపోతున్న రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి బ్యూటీలకు దేవుడు ఇచ్చిన వరంగా రవితేజా మారాడు అనుకోవాలి. అయితే రవితేజా ఈ యంగ్ హీరోయిన్స్ పై చేస్తున్న ప్రయోగం ఎంత వరకు సక్సస్ అవుతుంది అన్న విషయం ‘పవర్’ ఫలితం పై ఆధారపడి ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: