ఒక టాప్ హీరో సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఆ హీరో అభిమానులకు ఆనందంతో టెన్షన్ పెరిగిపోతే ఆ సినిమా పై వచ్చే నెగిటివ్ రూమర్స్ తో ఆ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు టెన్షన్ తో నిద్రలేని రాత్రులు గడపవలసిన పరిస్థితి నేడు టాలీవుడ్ పరిశ్రమలో ఏర్పడింది. రెండు వారాల క్రితం విడుదలైన ‘రభస’ సినిమాను కూడ విడుదలకు ముందు ఈ నెగిటివ్ రూమర్స్ షేక్ చేసాయి. ఇప్పుడు అదే పరిస్థితి రేపు విడుదల కాబోతున్న రవితేజ ‘పవర్’ కు ఏర్పడింది. ఈ నెగిటివ్ రూమర్లు ఎవరు ఎందుకు పుట్టిస్తున్నారో తెలియక పోయినా ఫిలింనగర్ లో మాత్రం తెగ హడావిడి చేస్తున్నాయి.  వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ‘పవర్’ సినిమా క్లైమేక్స్ మాస్ మహారాజ అభిమానులను ఏ మాత్రం మెప్పించదని క్లైమేక్స్ చిత్రీకరణ చాల వీక్ గా ఉందని టాక్. అదేవిధంగా ఈ సినిమా ఈ సినిమాను డైరెక్ట్ చేసిన బాబి దర్శకత్వ టేకింగ్ లో ఏమాత్రం కొత్తదనం లేదని కేవలం ఒక రొటీన్ మాస్ మసాల సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని దీని వల్ల ‘పవర్’ అనుకున్న స్థాయిలో హిట్ కావడం కష్టం అనే ప్రచారం కూడ ఊపు అందుకుంది. రాబోతున్న దసరా సీజన్ ను టార్గెట్ చేసుకుంటూ ఈ సినిమా వెనక వస్తున్న భారీ సినిమాలను కూడ లెక్క చేయకుండా వస్తున్న ‘పవర్’ పై వినిపిస్తున్న ఈ నెగిటివ్ ప్రచారం ఏమైనా హాని చేస్తుందా అనే విషయం రేపు తేలిపోతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి: