రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ పాటల చిత్రీకరణ లండన్ లో జరుగుతున్నప్పుడు ఆ షూటింగ్ చూడటానికి మన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అనేకమంది లండన్ లో ఉంటున్న మనవాళ్ళు చరణ్ పై తీస్తున్న ఆ పాట చిత్రీకరణను చూడటమే కాకుండా రామ్ చరణ్ తో ఫోటోలు వరస పెట్టి తీయించుకావడంతో చెర్రీకి లండన్ లో కూడ ఇంత క్రేజ్ ఉందా అని చాల మంది ఆశ్చర్యపోయారు.  అయితే ఈ వార్తలకు మరింత ఆశ్చర్య పరిచే విధంగా లండన్ లో ‘గోవిందుడు’ సినిమా కోసం చరణ్ తో కలిపి బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా నటించిన నికీ చెపుతున్న విషయాలు మరింత ఆశ్చర్యంగా ఉన్నాయి. ‘గోవిందుడు’ సినిమా కోసం రామ్ చరణ్ పై చిత్రీకరిస్తున్న ఇంట్రడక్షన్ సాంగ్ లో చరణ్ తో కలిసి డాన్స్ చేస్తున్న లండన్ డాన్సర్ నికీ కూడ చెర్రీ డాన్స్ చూసి ముచ్చట పడి అందరిలాగే రామ్ చరణ్ తో కలిపి ఒక ఫోటోను తీయించుకుని తన ఫేస్ బుక్ లో పెట్టుకుని తన స్నేహితులతో షేర్ చేసుకుంటే కొద్ది నిమిషాలలోనే చరణ్ తో కలిపి ఉన్న తన ఫోటోను చూసి తనకు 75 ఫ్రెండ్ షిప్ రిక్వెస్ట్ లు రావడం తనకు ఆశ్చర్యo కలిగించింది అని చెపుతోంది డాన్సర్ నికీ. అంతేకాదు తాను గతంలో ఎంతో మంది దక్షిణాది సినిమా హీరోల పాటలకు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా పనిచేసినా చరణ్ బాడీలోని డాన్సింగ్ మూమెంట్స్ తాను ఏ హీరో డాన్స్ లోను చూడలేదు అని తన ఫేస్ బుక్ లో కామెంట్స్ రాయడం చరణ్ అభిమానులనే కాకుండా అందర్నీ ఆశ్చర్య పరుస్తూ చెర్రీ క్రేజ్ లండన్ కు కూడ తాకింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: