పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయం చేసినట్టుగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి ముందుగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల, పాజిటివ్ ఫీలింగ్స్ ని కలిగించిన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యుడు అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత నుండి ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ కోసం ఎటువంటి సహాయం కాని, పవన్ కి ఉపయోగపడే విధంగా ఎటువంటి పనులు చేయలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నుండి ఎటువంటి సహాయాన్ని కోరుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రధేశ్ లో ఓ సినీ స్టూడియో నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వెస్ట్ గోదావరి జిల్లాలోని నరసాపురంలో పవన్ కళ్యాణ్ ఓ సినీ స్టూడియోని నిర్మించనున్నాడు. టాలీవుడ్ లో దీనికి సంబంధిన న్యూస్ వేగంగా వినిపిస్తుంది. అందుకోసం పవన్ కళ్యాణ్ కట్టబోతున్న స్టూడియో నిర్మాణానికి అవసరమైన భూముల్ని చంద్రబాబు నాయడు ఇస్తున్నట్టుగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్, తను నిర్మించబోతున్న స్టూడియో ప్రదేశంలో మరి కొన్ని గ్రామాలను దత్తతకు తీసుకొనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంలో పార్టీపై పవన్ కళ్యాణ్ తను స్థాపించిన పార్టీ తరుపు నుండి ఎటువంటి ప్రశ్నలు సంధించకపోయినప్పటికీ, తనకు కావాలిసన పనులను చేయించుకుంటున్నాడనే టాక్స్ రాజకీయంగా బలంగా వినిపిస్తున్నాయని అంటున్నారు. అయితే కొంత మంది మాత్రం పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతోనే తను నిర్మించబోతున్న స్టూడియోకి ఫండ్స్ పెడుతున్నాడని అంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ లో తన బిజినెస్ యాక్టివిటీస్ ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: