టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోలు ఎవరంటే నాలుగైదు పేర్లు బయటకు వస్తాయి. అయితే వారిలో నెంబర్ వన్ ఎవరు అంటే రెండు పేర్లు బయటకు వస్తాయి. వారే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. వీరిద్దరిలో నెంబర్ వన్ ఎవరు అంటే కచ్ఛితంగా మహేష్ బాబు పేరును ఇప్పుడు ఆ పొజిషన్ లో చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు ఒక్కో మూవీకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల నుండి 23 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంగా తను గత నాలుగు చిత్రాల నుండి తీసుకుంటున్నట్టుగా టాలీవుడ్ లో లెక్కలు చెబుతున్నాయి. ఓ స్టార్ డం హీరో ఇలా వరుసగా తన రెమ్యునరేషన్ ను ఏ మాత్రం తగ్గకుండా, ప్రతి మూవీకి పెంచుకుంటూ వెళుతూ, మహేష్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. ప్రస్తుత లెక్కల ప్రకారం మహేష్ బాబు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో మొదటి వాడు. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని చెప్పవచ్చు. ప్రసుతం మహేష్ బాబు నటించిన ఆగడు మూవీ, రిలీజ్ కి సిద్ధంగా ఉంది. టాలీవుడ్ బాక్సాపీస్ రికార్డ్ లను ఆగడు మూవీ బ్రేక్ చేస్తుందనే ధీమాతో ఆగడు నిర్మాతలు ఉన్నారు. ఈ మూవీ అనంతరం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కూడ మహేష్ బాబు తీసుకుంటున్న రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. ఇలా మొత్తంగా మహేష్ బాబు ప్రస్తుతం నంబర్ వన్ పొజిషన్ లో చోటా నిర్మాతలకు దొరకనంతగా మారిపోయాడు. మహేష్ బాబుతో ఇప్పుడు మూవీ తీయాలంటే, కనీసం 50 కోట్ల రూపాయలను అవలీలగా ఖర్చు పెట్టే నిర్మాత అయి ఉండాలి. అలా అయితేనే తనతో మూవీ తీయడం నిర్మాతలకు సాద్యపడదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: