మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారికకు కాజల్ కు మధ్య గొడవ జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా నిహారిక ఆలీ నిర్వహిస్తున్న ఒక షోలో చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇక వివరాలలోకి వెళితే చాల ఏళ్ల క్రితం కాజల్ కెరియర్ మొట్టమొదటి రోజులలో నటించిన ‘చందమామ’ సినిమాలో కాజల్ కు తండ్రిగా నాగబాబు నటించాడు. ఈ సినిమా అప్పట్లో విజయవంతం కావడమే కాకుండా ఈ సినిమాలో కాజల్ నటనను చూసి నాగబాబు చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాకు హీరోయిన్ గా రికమెండ్ చేసాడు అనే మాట కూడ ఉంది. ‘చందమామ’ సినిమా నుండి కాజల్ కు నాగబాబుతో ఏర్పడిన పరిచయం రీత్యా బయట ఏదైనా ఫంక్షన్స్ లో నాగబాబు, కాజల్ ఎదురు పడినప్పుడు కాజల్ ఆప్యాయంగా ‘నాన్నా’ అంటూ పలకరించేదట. అయితే ఆ పిలుపు నాగబాబు కుమార్తె నిహారికకు ఏమాత్రం నచ్చక ఒకసారి కాజల్ నిహారికకు ఎదురు పడినప్పుడు తన తండ్రిని నాన్నా అని పిలవద్దని అంతగా అభిమానంగా పిలవాలి అనుకుంటే అంకుల్ అని పిలవమని కాజల్ కు క్లాస్ పీకిందట నిహారిక. అయితే ఈ అనుకోని సంఘటనకు షాక్ అయిన కాజల్ అప్పటి నుంచి నిహారికతో మాట్లాడటం తగ్గించి వేసిందట. ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్న నిహారిక తన చిన్న వయసులోని తొందర పాటుతో కాజల్ మనసును గాయ పరిచాననీ ఇప్పుడనుకుంటున్నానని నీహారిక ఆ షోను నిర్వహిస్తున్న ఆలీతో తన భావాలు షేర్ చేసుకుంది. అప్పటి దాకా అన్ని విషయాలు విన్న ఆలీ మాత్రం నిహారిక పై జోక్ చేస్తూ కాజల్ మీనాన్నాను ‘‘నాన్న నాన్న’’ అంటూ పిలుస్తుంటే మీ అమ్మకు మీ నాన్న మీద ఏమైనా అనుమానం వచ్చిందా’’ అంటూ సెటైర్ వేశాడు ఆలీ. ఈ సెటైర్ కు నిహారికతో పాటు ఆషో చూస్తున్న వారంతా నవ్వుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: