మంచు వారి కుటుంబ సభ్యుడిగా మారిపోయిన వర్మ మంచు కుటుంబ సభ్యులతో వరస పెట్టి సినిమాలు తీసేస్తున్నాడు. ఆ మధ్య మోహన్ బాబును డిఫరెంట్ లుక్ తో రౌడీగా చూపెట్టిన వర్మ, రేపు విడుదల అవుతున్న ‘అనుక్షణం’ సినిమా ద్వారా విష్ణును విభిన్నంగా చూపెడతాను అని అంటున్నాడు. అంతేకాదు విష్ణుతో కలిపి సినిమా బిజినెస్ లు కూడ చేసేస్తున్నాడు. ఇది చాలదు అన్నట్లుగా లేటెస్ట్ గా వర్మ ద్రుష్టి మంచు మనోజ్ కండల పైనా మంచు లక్ష్మి పాదం పైనా దృష్టి పెట్టాడు అనే వార్తలు వస్తున్నాయి. మనోజ్ కండలు బాగుంటాయి కాబట్టి ఆ కండల పైనే తన దృష్టి పెట్టి ఒక షార్ట్ ఫిలిం తీసాడట వర్మ. దాదాపు రెండు నిముషాల పాటు ఉండే ఈ షార్ట్ ఫిలింలో మనోజ్ కండలను చూపెడుతూ ఏమి చెపుతాను అన్నది సస్పెన్స్ అంటున్నాడు వర్మ, అదేవిధంగా లక్ష్మీ ప్రసన్న పాదాన్ని మాత్రమే చూపెడుతూ మరో షార్ట్ ఫిలిం తీసాడట. ఈ షార్ట్ ఫిలింలో కూడ ఏమి చెపుతాడో ఎవరికీ అంతుచిక్కని రహస్యం. ఈ రెండు షార్ట్ ఫిలిమ్స్ ను త్వరలోనే జనానికి చూపెట్టి మరో సంచలనానికి వర్మ శ్రీకారం చుట్ట బోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఏమైనా వర్మ మితిమీరిన ప్రయోగాలతో టాలీవుడ్ ప్రేక్షకులు భయపడిపోతున్నారు అని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: