ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అంతా బిజి బిజి షెడ్యూల్స్ ని గడుపుతున్నారు. అయితే వీరు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కూడ ఓ రేంజ్ లో ఉంటుంది. దీంతో వీరు సంపాదించిన సంపాదనని ఏం చేస్తున్నారనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. ఒకప్పటి హీరోయిన్స్ అయితే వారు సంపాదించిన సంపాదనని ఇంటి అవసరాలకో, బంధులకో, తోటి హీరో కోసం ఖర్చు పెట్టే వారు. కాని ఇప్పటి హీరోయిన్స్ చాలా తెలివైన వాళ్ళు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ అంతా ఒక వైపు మూవీలను చేస్తూనే, మరో వైపు బిజినెస్ లు చేస్తున్నారు. వచ్చిన మనీను అంతా రియల్ ఎస్టేట్ లోనూ, స్థిరాస్థి రూపంలోనూ మార్చుకుంటున్నారు. ఆ విధంగా గోవా బ్యూటీ ఇలియానా కూడా హైదరాబాదులో గతంలో ఓ ఇల్లు కొంది. 1.25 కోట్లతో మణికొండలోని లాంకో హిల్స్ లో అప్పట్లో ఓ ఫ్లాట్ తీసుకుంది. గతంలో ఆ ఇల్లుని అమ్మేయాలని తెగ ప్రయాత్నాలు చేసింది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదులో ఇళ్ల రేట్లు తగ్గిపోతుండడంతో ఈ ఇంటిని త్వరగా వదిలించుకోవాలని అమ్మడు కంగారుపడుతోందట. ఆ సమంలో కేవలం కోటి రూపాయల రేటు రావడమే కష్టంగా ఉన్న సమయంలో ఇప్పుడు, తన ఇంటిని ఓ అభిమాని కొనటానికి ముందుకొచ్చాడు. 1.25 కోట్ల రూపాయల విలువైన ఆ ప్లాట్ ని, 2 కోట్ల రూపాయలకు తీసుకోబోతున్నాడు. అయితే ఆ అభిమాని మాత్రం ఓ కండిషన్ పెట్టాడు. తనతో లాంగ్ రిలేషన్ మెయింటెన్ చేస్తాను అంటేనే తను ఆ ప్లాట్ ను తీసుకుంటానని అంటున్నాడు. ప్రస్తుతం లాంకో హిల్స్ ప్రాజెక్ట్ జరగుతుందా? లేదా? అనే అనుమానాలు అందరిలో ఉన్న పరిస్థితుల్లో, కేవలం ఇలియాన కోసం ఆ మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నాడంటే, ఆ అభిమాని అడిగే కోరిక సరైనదే అని కొందరు అంటున్నారు. మరి ఇలియాన ఇల్లుఅమ్ముకొని అభిమాని కోరిక తీరుస్తుందో? లేదో? చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: