దర్శకుడు శంకర్‌ తన ‘ఐ’ సినిమాకు సంబంధించిన ఒకొక్క గుట్టును విప్పుతున్నాడు. లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో విక్రమ్ ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ హాలీవుడ్ లో సంచలనాలు క్రియేట్ చేసిన ‘హల్క్’ సినిమా ఫస్ట్ లుక్ కు కాపీగా ఉందని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. అయిదు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ ‘హల్క్’ హాలీవుడ్ లో కలెక్షన్స్ రికార్డులను సృష్టించింది. ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం విక్రమ్ పడిన కష్టం ఇప్పటి వరకు దక్షిణాది సినిమా రంగంలో మరే హీరో పడలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా అంతా ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్న విక్రమ్ లుక్ తో పాటు సిక్స్‌ప్యాక్ నెటిజన్ లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వచ్చే వారం విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో విడుదల తరువాత ఈ సినిమా పై ఒక స్పష్టమైన అంచనా వచ్చే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: