పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానుల పై అసహనంగా ఉన్నాడు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా మెగా అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోవడం పై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని సమాచారం. తనకు తన అన్న చిరంజీవికి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా ఆ అభిప్రాయాల వల్ల మెగా అభిమానులు ఎందుకు విడిపోవాలి అన్న అభిప్రాయంలో పవన్ తన సన్నిహితుల దగ్గర కామెంట్ చేస్తున్నట్లు టాక్. అదే విధంగా తన పేరు మీదట రాష్ట్ర స్థాయిలో పవన్ యువసేన అనే పేరుతో ఎటువంటి సంఘాలను ఏర్పాటు చేయవద్దని అటువంటి సంఘాలకు తన మద్దతు ఉండదని ఈ ప్రయత్నాలు చేస్తున్న తన అభిమానులకు ఇప్పటికే సంకేతాలు పంపినట్లుగా ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. గతవారం తిరుపతిలో జరిగిన చిరంజీవి అభిమాన సంఘాల కార్యక్రమానికి పవన్ అభిమానులకు పిలుపు రాకపోవడంతో పవన్ వీరాభిమానులు విజయవాడలో కాని రాజమండ్రిలో కాని ఒక ప్రత్యేక సమావేశాన్ని ఈ నెలలో ఏర్పాటు చేయబోతున్నారు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో పవన్ తన అభిమానుల విషయంలో ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టాడు అని అంటున్నారు. అయితే నిజంగా పవన్ తన అభిమానుల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయగాలడా అన్న విషయం మరి కొద్ది రోజులలో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: