టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తున్న హీరో అల్లుఅర్జున్. ఇదిలా ఉంటే అల్లుఅర్జున్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘జులాయి’ తర్వాత, అల్లు అర్జున్ మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇది. దీంతో ఈ మూవీపై బాక్పాపీస్ మార్కెట్ లో ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకోసం అల్లుఅర్జున్ తన బరువును తగ్గించుకుంటున్నారు. దాదాపు తను అనుకున్న దానికంటే ఎక్కువే బరువు తగ్గాల్సి వచ్చిందట. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం స్లిమ్ అండ్ ఫిట్ గా తయారవుతున్నాడు. అందుకోసం అల్లు అర్జున్ స్పెషల్ వర్కౌట్స్ చేసి 10 కేజీల వెయిట్ కూడా తగ్గాడు. మొదట ఏడు కేజీల వరకూ బరువు తగ్గించుకోవాలని చూసిన అల్లుఅర్జున్, తరువాత దానిని పది కేజీల వరకూ కొనసాగించాడు. ఇప్పుడు అల్లుఅర్జున్ తను వున్న బరువులోంచి 10 కేజీల బరువును తగ్గడంతో మొత్తంగా లుక్కే మారిపోయింది. ఈ మూవీలో కొద్దిపాటి యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటంతో, స్టైలిష్ స్టార్ తన బరువును తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ అయితే అల్లుఅర్జున్ బరువును ఇంకా కొద్దిగా తగ్గించేందుకు చూస్తున్నాడు. మొత్తంగా ఈ మూవీలో అల్లుఅర్జున్ గెటప్ అండ్ లుక్ రెండూ పూర్తిగా డిఫ్రెంట్ గా ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన ముగ్గురు భామలు జోడీ కట్టనున్నారు. అందులో ఇప్పటికే సమంత, ఆద శర్మ హీరోయిన్స్ గా ఎంపిక కాగా మరో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. అల్లు అర్జున్ కి గట్టి పోటీని ఇచ్చే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: