పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాగాజా తను వ్యవహరిస్తున్న తీరు అందరిని విస్మరిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తను పార్టీను పెట్టినప్పటి నాటి తీరు, ప్రస్తుత రోజుల్లో కనిపించటం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏదైనా చేస్తే, చూడాలని సామన్య జనానికి సైతం ఉంది. కాని పవన్ కళ్యాణ్ మాత్రం తను పార్టీ పెట్టడంలో చూపిన స్పీడుని, పార్టీని నడపటంలో చూపించడం లేదు. అలాగే గతంలో జగ్గారెడ్డిని కలిసి తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్, తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జగ్గారెడ్డి కోసం ఎటువంటి ప్రచారంలోనూ పాల్గొనలేదు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కేసిఆర్, చాలా పవర్ ఫుల్ గా ఉన్నాడు. అధికార పార్టీని కాదని ఏమైన యాక్టివిటీస్ చేస్తే, వారి తిక్కను వదల్చటానికి అధికార పార్టి సిద్ధంగా ఉంది. అంతే కాకుండా మరో వైపు తను నటిస్తున్న చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలు కావడంతో, ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని పవన్ ఆలోచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమైనా రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తే ఆ ప్రభావం తను నటిస్తున్న సినిమాలపై, సినిమా నిర్మాతలపై బలంగా కనిపిస్తుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఎటువంటి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం లేదు. మూవీల రిలీజ్ వరకూ వేయిట్ చేసి, రాజకీయంగా తను ఏంటో చూపించాలనుకుంటున్నాడు. అందుకే చాలా మంది పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? అనే కౌంటర్స్ వేస్తున్నప్పటికీ, పవన్ మాత్రం తన నిర్మాతల కోసం కామ్ గా ఉంటున్నాడనే వార్తలు టాలీవుడ్ నుండి బలంగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న గోపాల గోపాల మూవీ త్వరలోనే షూటింగ్ ని పూర్తిచేసుకోబోతుంది. తరువాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్2 మూవీలో నటిస్తాడా? లేదా? అనేది అనుమానమే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: