కొన్ని కొన్ని వార్తలు ఎవరు ఎందుకు లీక్ చేస్తారో తెలియక పోయినా ఆ వార్తలు నిజంగానే జరిగాయా అన్నట్లుగా అందర్నీ నమ్మించేడట్లుగా ఉంటాయి. ఇప్పుడు అటువంటి ఒక వార్త ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉన్న జూనియర్ కు రాజమౌళి కెరియర్ బ్రేక్ ఇవ్వడానికి వచ్చే సంవత్సరం ఒక సినిమాను జూనియర్ తో చేయడానికి అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ‘రభస’ ఘోర పరాజయం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళిని వ్యక్తిగతంగా కలిసి తనకు ఒక సినిమా చేసి పెట్టమని కోరినట్లుగా టాక్. దీనికి రాజమౌళి ‘బాహుబలి’ విడుదల తరువాత జూనియర్ కోరిక తీరుస్తానని మాట ఇచ్చినట్లుగా వార్తల హడావిడి జరుగుతోంది. జూనియర్ కు మొట్టమొదటి కెరియర్ బ్రేక్ ఇచ్చిన ‘‘స్టూడెంట్ నెం 1’ ఆ తరువాత ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ గా మార్చిన ‘‘సింహాద్రి ‘, లతో పాటు వరస పరాజయాలతో ఉన్న జూనియర్ ను ‘యమదొంగ ‘ గా మార్చి మూడు సూపర్ హిట్లు ఇచ్చిన ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని ఎప్పటి నుంచో వార్తలు ఉన్నా రకరకాల కారణాలతో ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు అనే వార్తలు కూడా చాలచాల సార్లు వినిపించాయి. అయితే ప్రస్తుతం జూనియర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేటి తరుణంలో నిజంగా జూనియర్ కోరికను రాజమౌళి మన్నిస్తే అది టాలీవుడ్ సంచలనమే అనుకోవాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: