ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పై ప్రముఖ నిర్మాత మురారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలన వార్తలుగా మారాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు విశాఖపట్నంలోని గీతo యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పురస్కారం ఇచ్చిన సందర్భంగా నిర్మాత మురారి ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాఘవేంద్రరావు సంస్కారంలేని వ్యక్తి అని అంటూ అలాంటి వ్యక్తికి గౌరవ డాక్టరేట్ బిరుదు అందుకునే అర్హత లేదని మండిపడ్డారు మురారి. ‘గోరింటాకు’, ‘నారినారి నడుమమురారి’, ‘త్రిశూలం’, వంటి ఎన్నో మంచి సినిమాలను తీసిన నిర్మాతగా మురారికి పేరు ఉంది. నిన్న చెన్నైలో ఒక ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని మురారి ఏర్పాటు చేసి రాఘవేంద్రరావుని టార్గెట్ చేస్తూ అనేక విషయాలను తెలియ చేసాడు ఈ నిర్మాత. తన దృష్టిలో రాఘవేంద్రరావు సంస్కారం లేని వ్యక్తి అని అంటూ, ఒకసారి రాఘవేంద్రరావు చెన్నైలో మాయాజాల్ సినీథియేటర్‌కు వచ్చినప్పుడు తన ఇంటికి ఆహ్వానిస్తే తన ఇంటికి వచ్చిన రాఘవేంద్రరావు తన తల్లి ఫొటోను చూసి అంత అసహ్యంగా ఉంది ఏమిటి అంటూ ఆ ఫోటో పై సంస్కర రహితంగా కామెంట్లు చేసిన కుసంస్కారి అంటూ దర్శకేంద్రుడు పై నిప్పులు చెరిగారు మురారి. అంతేకాకుండా తాను నిర్మించిన ‘త్రిశూలం’ చిత్రం హిందీ రీమేక్ హక్కులపై తనకు రావాల్సిన మూడు లక్షల రూపాయలను ఇప్పటికీ తనకివ్వలేదని ఆరోపించారు. అసలు ఆయనేమి సాధించాడని ఆయనకీ గౌరవ డాక్టరేట్ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డ మురారి వ్యాఖ్యలు ప్రస్తుతం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: