నిన్న భారీ అంచనాలతో విడుదలైన ‘పవర్’ సినిమా పాటలలోని ‘పవర్’ ను రవితేజా కావాలని తగ్గించివేశాడా అనే వార్తలు ఫిలింనగర్ లో ఊపు అందుకున్నాయి. నిన్న వచ్చిన ‘పవర్’ ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే పక్కా మాస్ మూవీగా తయారు అయిన ‘పవర్’ సినిమాలోని పాటలను ఎందుకు ఎడిటింగ్ చేసారో రవితేజా అభిమానులకు కూడ అర్ధంకాని పరిస్థుతులలో ఉంది. మాస్ సినిమాలకు హీరోలు, హీరోయిన్స్ తో చేసే పాటల చిత్రీకరణ గుండెకాయలా మారుతుంది. వెరైటీ కాస్ట్యూమ్స్ తో హీరోలు హీరోయిన్స్ తో స్టెప్పులు వేస్తూ ఉంటే హీరో అభిమానులు ఫిదా అయిపోతారు. ‘పవర్’ సినిమా విషయంలో కూడ అదే జరిగింది. పూర్తి రొటీన్ కధతో కూడుకున్న ఈ సినిమాలో ఏ పాట కూడ మూడు నిముషాలకు మించి లేకపోవడం రవితేజా అభిమానులను నిరాశ పరిచింది. ఇక రెజీనాను చాల హాట్ గా చూపిస్తూ చిత్రీకరించిన మెలోడీ సాంగ్ కేవలం రెండు నిముషాలే ఉండటం మాస్ మహారాజ అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు చూసిన రవితేజా ఈ సినిమాలో పాటల సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ ను ఎడిట్ చేయమని దర్శకుడు బాబీతో చెప్పడంతో అ ఖంగారులో పాటల నిడివి కూడ తగ్గించి వేసారు అనే వార్తలు వస్తున్నాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సెన్సార్ సర్టిఫికేట్ లో ఈ సినిమా నిడివి 2.27 నిముషాలు అని కనిపిస్తే ఈ సినిమా మాత్రం ఒక 15 నిముషాల ముందే అయిపోవడం రవితేజా వీరాభిమానులను నిరాశ పరిచింది అనే వార్తలు వస్తున్నాయి. మరి కొందరు విమర్శకులు అయితే ‘పవర్’ పాటలు రవితేజాకే నచ్చలేదేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: